రైల్వే స్టేషన్‌లో వికృత చర్య.. బహిరంగంగా హస్త ప్రయోగం.. ఫేస్ బుక్ లో లైవ్ పెట్టిన మహిళ

రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి వికృత చర్యను ఓ మహిళా ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టింది. ఈఘటన పశ్చిమబెంగాల్‌లోని బందెల్‌ రైల్వే స్టేషన్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ఆ మహిళా ట్రైన్‌లో కూర్చొని ఉండగా.. ఆ వ్యక్తి మహిళల కంపార్ట్‌మెంట్‌ ముందుకు వచ్చి అందరు చూస్తుండగానే వికృత చర్యకు పాల్పడ్డాడు. దీంతో ఇబ్బెట్టుగా ఫీలైన ఆ మహిళ ఇతర ప్రయాణీకులను అప్రమత్తం చేసి రైలు దిగి అతన్ని బెదిరించే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన రైల్వే పోలీసుల.. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుంచి పరారయ్యాడు. సాక్ష్యం కోసమే ఫెస్‌బుక్‌లో లైవ్‌లో పెట్టినట్లు ఆ మహిళ తెలిపింది. రైల్వే పోలీస్‌ ఆఫీస్‌ ముందే అతను అందరు చూస్తుండగా అసభ్యంగా ప్రవర్తించాడని, తను వీడియో తీయడాన్ని గమనించే పోలీసులు అప్రమత్తమయ్యారని ఆమె వెల్లడించారు. పోలీసులు మాత్రం ఆ వ్యక్తికి మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పడం గమనార్హం. కోల్‌కతాలో కూడా ఓ బస్సులో ఇదే తరహా ఘటన చోటుచేసుకోగా ఓ మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)