పెళ్లికూతురు మెడలో తాళికట్టడానికి పెళ్లి కొడుకు ఎంతో ఆశగా ఎదరుచూస్తున్నాడు.. ఇంతలో పెళ్లికూతురు నగ్న వీడియో..

అమలాపురం మండలం వన్నెచింతలపూడికి చెందిన యువతిని ముమ్మిడివరం మండలం కొత్తలంకకు చెందిన యువకుడికిచ్చి శనివారం ఉదయం పెళ్లి చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. కొత్తలంకలో వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అంతా పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నారు. మరికొన్ని గంటలో పెళ్లికూతురు మెడలో తాళికట్టడానికి పెళ్లి కొడుకు ఎంతో ఆశగా ఎదరుచూస్తున్నాడు. ఇంతలో పెళ్లికొడుకు పేరిట కొరియర్‌ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగా అందులో మొబైల్ ఉంది. ఇక ఆ ఫోన్‌లోని వీడియోలు చూసి పెళ్లి కొడుకు షాక్ అయ్యాడు. షాక్ నుంచి నెమ్మదిగా తెరుకున్న వరుడు ఈ పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా చెప్పాడు. ఇంతకి ఆ వీడియోల్లో ఏం ఉందంటే.. తాను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి స్నానం చేసి బట్టలు మార్చుకుంటున్నపుడు తీసిన నగ్న దృశ్యాలు ఉన్నాయి. అందులోని వీడియోలు చూసిన అబ్బాయి పెళ్లి రద్దు చేసుకున్నాడు. దీంతో చేసేదేమీ లేక పెళ్లికుమార్తె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వీడియోల్లో కొంత మార్ఫింగ్‌ కూడా ఉన్నట్టు గుర్తించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)