(వీడియో) తన భార్యను, ఆమె రెండో భర్తను గ్రామంలో నగ్నంగా ఊరేగించిన భర్త, వీడియో తీసి నెట్ లో పెట్టారు

ఓ యువతి, యువకుడు ప్రేమించుకోవడం ఇష్టం లేని కొందరు వ్యక్తులు.. ఆ జంటను గ్రామంలో నగ్నంగా ఊరేగించారు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సమీపంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఒక యువకుడు సమీపంలోని మరో గ్రామానికి చెందిన పెళ్లయిన యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. తరువాత ఆ యువతిని అతను గ్రామానికి తీసుకువచ్చాడు. రాజస్థాన్‌లో మానవత్వానికి మచ్చతెచ్చే ఉదంతం వెలుగు చూసింది. ఉదయ్‌పూర్ పరిధిలోని ఒక గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒక యువకుడు సమీపంలోని మరో గ్రామానికి చెందిన పెళ్లయిన యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. తరువాత ఆ యువతిని అతను గ్రామానికి తీసుకువచ్చాడు. ఇక ఈ ప్రేమ జంటను నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. అక్కడ గుమిగూడిన జనమంతా దీనిని వినోదంగా చూశారేతప్ప ప్రేమ జంటకు సహాయం చేసే ప్రయత్నం చేయలేదు. పైగా దీనిని వీడియో తీశారు. ఉదయ్‌పూర్‌లోని సరేఖూర్ద్‌ గ్రామంలో గమేటీ కులానికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయి, వేరే వ్యక్తితో కలిసి ఉంటోంది.
అయితే కుల పెద్దల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావటంతో అతనితో తాళి కట్టించుకుని జీవిస్తోంది. ఈ క్రమంలో తనకు విడాకులు ఇవ్వకుండానే మరో వ్యక్తితో భార్య నివసిస్తుండటాన్ని ఆమె మొదటి భర్త సహించలేకపోయాడు. 
కోపంతో రగిలిపోయిన మొదటి భర్త దాష్టీకానికి పాల్పడ్డాడు. గ్రామస్తుల సహకారంతో ఆ జంటపై దాడి చేశాడు. ఆ ప్రేమ జంటకు శిక్ష విధించాలని భావించిన మొదటి భర్త, కొందరు గ్రామీణులు ఆ ప్రేమ జంట ధరించిన దుస్తులను తొలగించి తాడుతో కట్టేశారు. తరువాత వారిని నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. అలా వారిని నగ్నంగా గ్రామంలో ఊరేగిస్తుంటే స్థానికులు వారిని నిలువరించకపోగా.. వీడియోలు తీస్తూ ఆనందించారు. ఘటన తర్వాత పరువు పోతుందన్న ఉద్దేశంతో బాధితురాలు కూడా గప్‌చుప్‌గా ఉండిపోయింది. ఆ జంటను నగ్నంగా ఊరేగించిన దృశ్యాలను కొందరు వ్యక్తులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి.. సామాజిక మాధ్యమాలలో వైరల్ చేశారు. ఈ క్రమంలో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో సుఖేర్‌ టౌన్‌ పోలీసులు సీన్‌లోకి ఎంటర్‌ అయ్యారు. కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్‌ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో మహిళలు కూడా ఉన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 2016 జూన్ లో కూడా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో చోటు చేసుకున్న విషయం విదితమే. ఇద్దరు యువతీ యువకులు ప్రేమ పెళ్లి చేసుకున్నారని.. వారిని తీవ్రంగా కొట్టి.. వేధించి.. నగ్నంగా ఊరేగించారు. ఈ కేసులో 18 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో ప్రేమికుల తండ్రులు కూడా ఉన్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)