శ్రీకృష్ణుడిపై రేప్ కేసు పెడుతారా ? వెంకటేశ్వర సుప్రభాతంలో బూతులా ?

నాస్తికత్వం పేరుతో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రస్తుత బిగ్‌బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని, సినీ విమర్శకుడు మహేష్ కత్తిపై మాధవీ లత తీవ్రంగా స్పందించారు. హిందూ మతంలోని స్వేచ్ఛను ఆసరాగా తీసుకొని పురాణాలు, దేవతలను టార్గెట్ చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువులు పవిత్రంగా భావించే వెంకటేశ్వర సుప్రభాతాన్ని దూషించిన బాబు గోగినేని ఆమె తప్పుపట్టారు. వెంకటేశ్వర సుప్రభాతాన్ని బూతు అని వ్యాఖ్యలు చేసిన బాబు గోగినేనిపై కూడా మాధవీలత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడిపై రేప్ కేసు పెట్టాలని వ్యాఖ్యలు చేసిన గోగినేనిపై మండిపడ్డారు. ఒకవేళ హైకోర్టు నుంచి నోటీసుల తెస్తే శ్రీకృష్ణుడిని ఎక్కడ నుంచి పట్టుకొస్తారు. నెగిటివిటి ప్రచారం చేయడానికే బాబు గోగినేని, మహేష్ కత్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని మాధవి లత అన్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)