విద్యార్థినిపై 7 నెలలుగా ప్రిన్సిపాల్, 2 టీచర్లు, 15 మంది విద్యార్థులు గ్యాంగ్ రేప్

బీహార్ లో అత్యంత దారుణమైన, అమానవీయ సంఘటన వెలుగు చూసింది. గత ఏడు నెలలుగా బ్లాక్ మెయిల్ చేసి పాఠశాల ప్రిన్సిపాల్, ఇద్దరు టీచర్లు, 15 మంది విద్యార్థులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారని ఓ పాఠశాల విద్యార్థిని ఆరోపించింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రిన్సిపాల్ ను, టీచర్ ను, ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేశారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా ఛాప్రా పర్సాగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన తండ్రి 2017 డిసెంబర్ లో జైలుకు వెళ్లాడని, అప్పటి నుంచి దీపేశ్వర్ జ్ఢాన్ నికేతన్ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తనపై సామూహిక అత్యాచారం చేస్తూ వస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత తండ్రికి విషయం చెప్పింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం - బాలికపై 2017 డిసెంబర్ లో పాఠశాలలోని వాష్ రూంలో అదే పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ సంఘటనను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నారు. ఎవరికైనా చెప్తే వీడియోను అందరికీ చూపిస్తామని బెదిరిస్తూ వచ్చారు. వీడియోను బయటపెడుతారనే భయంతో బాలిక ఇతర విద్యార్థుల, టీచర్ల కోరికను తీర్చడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆ వీడియోను ఇతర విద్యార్థులకు కూడా పంపిణీ చేశారు. దీంతో పలు సందర్భాల్లో ఆమెపై ఇతర విద్యార్థులు కూడా బ్లాక్ మెయిల్ చేసి కోరిక తీర్చుకుంటూ వచ్చారు. తొలుత పోలీసులు ఫిర్యాదును తీసుకోవడానికి నిరాకరించారు. అయితే, ఉన్నతాధికారులకు చెప్తామని హెచ్చరించడంతో కేసు నమోదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)