‘టీవీ-9’ ఎంతటి నీచ, నికృష్టపు ఛానల్ అంటే..

ఫోర్త్‌ ఎస్టేట్‌గా ప్రజా సమస్యలను.. కష్టాలను రిపోర్టింగ్ చేయడంతో పాటు.. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకువచ్చి ఆ సమస్యల పరిష్కారం దిశగా తీసుకువెళ్లడం ఉత్తమమైన మీడియా చేసే పని..

ప్రజా సమస్యలను కేవలం రిపోర్టింగ్ చేసి అక్కడితో చేతులతో దులిపేసుకోవడం- మధ్యమస్థాయి మీడియా చేసే పని

అలా కాకుండా, ప్రజల్లో అలజడి రేపడం.. వారి మనోభావాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా గాయపరచడం..అధమ స్థాయి.. నీచ నికృష్ణ మీడియా చేసే పని!

ఘనత వహించిన తెలుగు న్యూస్ ఛానల్‌ ‘టీవీ-9’ ఈ ఆఖరి స్థాయికి చెందిందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటా!

పైన చెప్పినట్లుగా, మీడియాలో చర్చ అనేది అర్థవంతమైందిగా ఉండాలి. ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చి ఆ సమస్య పరిష్కారదిశగా ఆయా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఉండాలి..లేదంటే పరిష్కారం మాట అటుంచి.. కనీసం ప్రజా సమస్యలపై సామాజిక అవగాహన పెంచే విధంగానైనా ఉండాలి! అందుకే ఓ పాపులర్ జర్నలిస్ట్ పితామహుడు ‘న్యూస్ ఈజ్ పీపుల్‌’ అన్నాడు. అయితే, దీనికి విరుద్ధంగా మనం గొర్రెల్లా చూస్తున్నాం కాబట్టి.. మెరుగైన సమాజం అనే ముసుగులో ‘టీవీ-9’ చేస్తున్న జర్నలిజం ఏంటంటే.. జనాల్లో ఒక రకమైన అలజడి సృష్టించడం.. జనాల మనోభావాలను దెబ్బతీయడం.. స్వయం ప్రకటిత మేథావులు.. ఓ వ్యక్తిత్వం అంటూ లేని వాళ్లను తీసుకొచ్చి వారిని గంటల గంటల పాటు తమ స్టూడియోలో కూర్చోబెట్టి, నానా బురద చల్లించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఘనత వహించిన తొలి తెలుగు ఛానల్ గురించి దరిద్రపు చరిత్ర బోల్డంత చెప్పుకోవచ్చు.

అందుకే, పదో తరగతి రెండు సార్లు తప్పి మూడోసారి అతి కష్టం మీద pass అయినప్పటకీ, సామాజిక అంశాల మీద, సమకాలీన రాజకీయాల మీద అద్భుతంగా విశ్లేషించే మా శృంగవృక్షం సుబ్బరాజు గాడు మూడేళ్ల క్రితమే నాకు ఈ విధంగా జ్ఞానబోధ చేశాడు. వాడు అప్పట్లో టీవీ-9 గురించి చేసిన హితబోధ ఏంటంటే.. ” ఆ టీవీ-9 ఛానల్‌ పేరు వింటేనే నాకు కడుపులో డోకు వస్తుందిరా బాబు. అదంటే నాకు అసహ్యమెహే! దాని పుట్టుక, ఎదుగదల మొత్తం అవినీతేరా నాయనా.. రేటింగ్‌ల కోసం ఎంత సిగ్గుమాలిన పనులకైనా.. ఎంత ఛండాలపు పనులకైనా వాళ్ల వెనకాడర్రా.. వాళ్లని బెదరిస్తూ..వీళ్లని బెదిరిస్తూ.. ఒక్కోసారి బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తూ ఆ ఛానలోళ్లు బోల్డంత సంప్రాదించేశ్రారా” అని చెప్పి ఆ ఛానల్‌ రిపోర్టర్లు, స్ట్రింగర్లు చేసిన కొన్ని బ్లాక్‌మెయిలింగ్ సంఘటనలు వివరించాడు.

The press is a gang of cruel faggots. Journalism is not a profession or a trade. It is a cheap catch-all for fuck offs and misfits—a false doorway to the backside of life, a filthy piss-ridden little hole nailed off by the building inspector, but just deep enough for a wino to curl up from the sidewalk and masturbate like a chimp in a zoo-cage.
పై స్టేట్‌మెంట్‌ కూడా ‘టీవీ-9’ కు అతికినట్లు సరిపోతుందని చాలా మంది భావిస్తున్నారు. ఇది హంటర్‌.ఎస్‌. థాంప్సన్‌ అనే అమెరికన్ పాపులర్ జర్నలిస్ట్ ‘ప్రెస్’ ను ఉద్దేశించి చేసిన పాపులర్ వ్యాఖ్య. ఈ వాక్యాన్ని టీవీ-9 ఛానల్‌ లాగా నేను పూర్తి సంస్కారహీనుడిని అవలేదు కాబట్టి..ఇక్కడ అనువాదం చేయడం లేదు.. ఈ వాక్యం మీకర్థమయితే మంచిదే. అర్థం కాకపోతే కాస్త ఇంగ్లీష్‌ పరిజ్ఞానం ఉన్న వాళ్ల ద్వారా ఈ స్టేట్‌మెంట్‌లో ఉన్న ఘాటైన మీనింగ్‌ను అర్థం చేసుకోండి.

పై స్టేట్‌మెంట్‌ ను మొదటిసారి చదివినప్పుడు.. ఇది నాకు అత్యంత పరమ చెత్త కామెంట్ లాగా అనిపించింది. ఎనిమిదేళ్ల క్రితం జర్నలిజంలో తొలి అడుగులు వేస్తున్నప్పుడు.. జర్నలిజం మొత్తం ఆదర్శంగా ఉంటుందన్న భ్రమలో.. మాయలో ఉన్నప్పుడు చదివిన ఈ వాక్యం చాలా నాన్‌సెన్స్‌గా, ఇడియాటిక్‌ స్టేట్‌మెంట్‌ లాగా అనిపించింది. ఇదేంటి జర్నలిస్ట్‌లను ఇంత మాట అనేశాడు.. అత్యంత పవిత్రమైన పాత్రికేయ వృత్తిని..ఇంత మాట అంటాడా.. వీడొక సిల్లీ ఫెలో అని అప్పట్లో ది గ్రేట్ జర్నలిస్ట్‌.. నవలిస్ట్‌.. హంటర్‌.ఎస్‌.థాంప్స్‌ను తిట్టుకోవడం జరిగింది..

కానీ, గత కొన్నేళ్లుగా తెలుగు మీడియా తీరు చూస్తుంటే, ఇది చాలా వేల్యూబుల్‌ కామెంట్‌లాగా అనిపిస్తుంది.. అరేరే.. హంటర్ ఎస్‌ థాంప్సన్ అప్పట్లోనే.. అందరూ కాకపోయినా కొందరు జర్నలిస్ట్‌లు గురించి ఎంత కరెక్ట్‌గా చెప్పాడు. ‘టీవీ-9’ లాంటి చెత్త మీడియాను, రోగ్ మీడియాను అప్పట్లోనే అమెరికాలో చూసి ఆయన ఈ మాట అనుంటాడు.. అని నా చిన్న బుర్రకి చాలా ఆలస్యంగా అర్థమైంది. తొలి రోజుల్లో ‘ganzo journalism’ కు ఆద్యుడైన హంటర్ ఎస్ థాంప్సన్‌ ను తప్పుగా అర్థం చేసుకున్నామే ఇప్పుడు బాధపడవలసి వస్తోంది.

కత్తి మహేష్‌ లాంటి స్వయం ప్రకటిత మేథావులు.. శ్రీరెడ్డి లాంటి అపరప్రతివ్రతలను మన మీదకు రుద్ది.. వాళ్లు మాట్లాడే నీచపు మాటల్ని.. అసందర్భ ప్రేలాపనల్ని.. విద్వేషపు పదజాలాన్ని… ప్రచారం చేస్తూ, జనాలకు ఉపయోగం లేని పనికిమాలిన విషయాల మీద బుడబుక్కల చర్చలు పెట్టి.. ఇద్దరు వ్యక్తుల మధ్య పర్సనల్ గొడవల్ని కూడా కొండంత హైలెట్ చేసి.. ఛాంతాండంత సాగదీసి.. టీఆర్‌పీల కోసం అడ్డమైన గడ్డి తినే టీవీ-9 కు బురిడీ బాబాలకు పెద్ద తేడా లేదు.

బురిడీ బాబాల్లో ఎంతటి హిపోక్రసీ కనిపిస్తుందో.. టీవీ-9 లో కూడా అదే స్థాయి కపటత్వం కనిపిస్తుంది. బురిడీ బాబాలు.. పైకి భక్తుల దగ్గర ‘భక్తి..ముక్తి భగవంతుడు.. మోక్షం..’ అంటూ ఆధ్మాత్మిక కబుర్లు చెబుతూ.. నటిస్తూ.. లోపల మాత్రం రక్తి తో.. కామంతో రగిలిపోతుంటారు.

ఇంచుమించు ‘టీవీ-9’ కూడా బురిడీ బాబా లాంటిదే.. టీవీ-9 ను చూడండి మెరుగైన సమాజం అనే ఎజెండా ను మోస్తున్నట్లు నటిస్తూ.. దానికి విరుధ్దంగా ఎప్పుడూ సమాజానికి విచ్చిన్నం చేసే చర్చలను.. సమాజానికి గందరగోళం చేసే రాద్ధాంతాలను, సమాజంలోని వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టే స్టోరీలను ఆ ఛానల్ ప్రోత్సహిస్తుంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. టీవీ-9 పైకి చెప్పేది ఒకటి.. ఆచరించేది మరొకటి! శాంపిల్‌కి కొన్ని ఉదాహరణలు..

*ఆ మధ్య సో కాల్డ్ బురిడీ బాబా రమణానందను ప్రమోట్ చేసి హిందు సమాజంలో సాయి భక్తులకు .. సనాతన ధర్మ వాదుల మధ్య చిచ్చు రగిల్చిన ప్రయత్నం మీకు గుర్తుండే ఉంటుంది..
*సాయిబాబా దేవుడా.. మనిషా అనే చర్చను బట్టి హిందూ సమాజంలో గొడవలు పెట్టే ప్రయత్నం చేసింది టీవీ-9
*చాగంటి గారు ఎప్పుడో ఓ ప్రవచన కార్యక్రమంలో అన్న మాట మీద చర్చోపచర్చలు పెట్టి.. ఆయన మీదకు యాదవులను ఎగదోసింది టీవీ-9
*శ్రీకృష్ణదేవరాయులు యాదవ కులమా..కాపు కులమా అనే చర్చను పెట్టి.. ఆ రెండు కులాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం..
*కత్తి మహేష్ గొడవ మీద పరిధికి మించి చర్చలు పెట్టి.. అతడికి పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ కు ఎప్పటికప్పుడు తగాదాను పెద్దది చేయడం..

ఇలా అవకాశం వచ్చిన ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకొని సమాజాన్ని.. విచ్చిన్నం చేస్తూ, ద్వేషాలను.. విద్వేషాలను ఎగదోస్తూ కేవలం తన trp రేటింగ్ ల.. తన సంస్థ ఎదుగదల కోసం.. లాభార్జన కోసం సమాజ పతనాన్ని కోరుకుంటున్న టీవీ-9ను ఏం చేయాలో మీరే ఆలోచించండి!

ఇక ప్రస్తుత విషయానికి వద్దాం! బాబుగోగినేని విషయంపై ‘టీవీ-9’ పెట్టిన చర్చలో ‘రాముడు ఒక దగుల్భాజీ…సీత రావణుడితో ఉంటేనే న్యాయం జరిగి ఉండేది’.. అని కత్తి మహేష్ కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శ్రీరాముడిపై అత్యంత అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తుంటే, సదరు టీవీ-9 యాంకర్‌ ఖండించకుండా.. హాయిగా చూస్తూ కూర్చుంది. సాధారణంగా టీవీ చర్చల్లో ఒక వ్యక్తి మరో వ్యక్తి పై వ్యక్తిగతమైన దాడి చేస్తున్నా.. వ్యక్తిగతమైన దూషణలు చేస్తున్నా, సదరు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న ఛానల్‌ వ్యాఖ్యాతలు ఊరుకోరు. ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే ఆ వ్యాఖ్యలు ఉపసహరించుకోవాలనో లేదా తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలనే మోడరేటర్ స్థానంలో ఉన్న టీవీ-హోస్ట్‌లు డిమాండ్ చేస్తారు. అలాంటిది ‘టీవీ-9’ చర్చా కార్యక్రమంలో కోట్లాది హిందువులు ఆదర్శంగా భావించే శ్రీరాముడిని కత్తి మహేష్ ‘దగుల్భాజీ’ అంటూ ఒకసారి కాదు.. మాట్లాడిన మూడు నిమిషాల ఫోన్‌-ఇన్‌లో పదే.. పదే తిట్టే ప్రయత్నం చేస్తూ..శ్రీరాముడిని అగౌరవపరుస్తుంటే.. నవ్వుతూ దద్దమ్మాలా కూర్చున్న ‘టీవీ-9’ యాంకర్ సుమతి ని ఏమనాలి! అంటే రాముడిని ఓ సూడో మేథావి తిడుతుంటే ‘టీవీ-9’ కు నవ్వులాటగా ఉందా?

వాస్తవానికి, ఈ విషయంలో కత్తి మహేష్ ది ఎంత తప్పో.. ఆ తప్పు చేస్తున్నప్పుడు దద్దమ్మలా కూర్చుని ఎంజాయ్ చేస్తున్న.. ‘టీవీ-9’ ది కూడా అంతే తప్పు! అవునులేండి.. కత్తి మహేష్‌ తాము పెంచి పోషించిన ముద్దుబిడ్డ కదా.. ఆయనను వారు ఏమి అనలేరు.. ఎవరైనా సొంత బిడ్డను ఎక్కడైనా తిడతారా! పైగా ఆ ముద్దుబిడ్డ తమ జెండాను, ఎజెండాను మోస్తున్నాడు కదా! పోనీ.. జరిగిందేదో జరిగిందని ఆలోచించి ఈ విషయంలో క్షమాపణలు చెప్పి జరిగిన తప్పును దిద్దుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా టీవీ-9 కు కలగలేదు. ఈ విషయంలో తాము ఎటవంటి తప్పు చేయలేదని తెలుపుతూ టీవీ-9 చేసిన ఈ స్టోరీని చూడండి!

ఆఖరుగా, కాలం చెల్లిన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను నరనరాన జీర్ణించుకున్న ‘టీవీ-9’ ఎల్లప్పుడూ హిందూ మతంపై విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నా.. అప్పటికప్పడు ఆ ఛానల్‌ను నాలుగు మాటలు తిట్టేసి ఆ తర్వాత యథావిధిగా టీవీ-9 ఛానల్ ను చూసే తెలుగు రాష్ట్రాల్లోని హిందువులకు హ్యాట్సాఫ్‌! మీరు ఇలా ఆదరిస్తున్నంత కాలం, టీవీ-9 ఇలాంటి సిగ్గుమాలిన పనులకు పాల్పడుతూనే ఉంటుంది. అందుకే, ఈ విషయంపై మరోసారి ఆలోచించుకోండి!
Article written by గిరిధర్‌
Article Source :- Korada.com

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)