కిడ్నాప్ చేసారంటూ డ్రామా ఆడి లెక్చరర్ ని పెళ్లి చేసుకుంది

Loading...
కడప జిల్లాకు చెందిన లక్ష్మీ ప్రసన్న అనే యువతి ఓ కాలేజీలో చదువుతుంది. కాలేజీ లెక్చర్ సాయి కేశవరెడ్డి, సదరు యువతి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక యువతి పెద్ద ప్లానే అల్లింది. మొదట ఓ బుర్ఖా కొనుగోలు చేసింది. రెండు రోజుల క్రితం బుర్ఖాను బ్యాగులో పెట్టుకొని ఇంటి నుంచి బయటకు వచ్చింది లక్ష్మీ ప్రసన్న. కడపలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలోకి వెళ్లి ప్రసన్న బుర్ఖా ధరించింది. ఆ తర్వాత సాయి కేశవరెడ్డి వెయిట్ చేస్తున్న ఆళ్లగడ్డకు కడప నుంచి బస్సులో బయల్దేరింది.

ఈ సమయంలో తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని.. చంపేస్తామని బెదిరిస్తున్నారని వాట్సాప్‌లో తల్లిదండ్రులకు మేసేజ్ పెట్టింది. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన పోలీసు స్టేషన్‌కు వెళ్లి తమ బిడ్డ అదృశ్యమైందని.. ఆమెను అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రసన్న కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సీన్ కట్ చేస్తే.. సాయికేశవ రెడ్డి, ప్రసన్న కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని ఓ ఆర్యసమాజ్ కేంద్రంలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకున్న ఫోటోలను వాట్సాప్‌లో తల్లిదండ్రులకు పంపింది ప్రసన్న. తనను కిడ్నాప్ ఎవరూ చేయలేదని మేసేజ్ పెట్టింది. ఇద్దరం మేజర్లం కాబట్టి.. తమ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని వీడియో మేసేజ్‌లో పోలీసులకు స్పష్టం చేసింది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ప్రసన్న కుటుంబ సభ్యులు.. వీరి ప్రేమ వివాహంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...