మన రాముడిని దూషించిన ఆ నీచుడిని వదిలిపెట్టకూడదు-నాగబాబు

పాపులారిటీ కోసం, పబ్లిసిటీ కోసం అడ్డమైన గడ్డి కరిచే రకం, ఎంతకైనా దిగజారే వ్యక్తిత్వం అతడి సొంతం. పబ్లిసిటీ కోసం నిన్నటి వరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తెగ వాడుకున్నాడు.. ఇప్పుడు హిందువుల దేవుళ్లపై పడ్డాడు. అతడే తనని తాను ఫిలిం క్రిటిక్ అని చెప్పుకునే కత్తి మహేష్. హిందువుల ఆరాధ్య దైవం, ప్రపంచానికే ఆదర్శమూర్తి శ్రీరామచంద్రడిపై కత్తి మహేష్ కూసిన కారు కూతలు కలకలం రేపుతున్నాయి. యావత్ హిందూ సమాజం భగ్గుమంటోంది. మా రాముడినే దూషిస్తావా? అంటూ హిందువులు, హిందూ సంఘాల నాయకులు, స్వామీజీలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు. రాముడిని దూషించిన కత్తి మహేష్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కూడా రంగంలోకి దిగారు. రాముడిని దుర్భాషలాడిన కత్తి మహేష్ పై నాగబాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. హిందువులు ఎంతో భక్తిభావంతో కొలిచే శ్రీరాముడిపై కండకావరంతో, కళ్లు మూసుకుపోయి దారుణమైన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నాగబాబు డిమాండ్ చేశారు. ఏమతాన్నైనా కించపరుస్తూ ఎవరు మాట్లాడినా తప్పేనని ఆయన అన్నారు. రామాయణం అనేది పుస్తకం కాదని… కోట్లాది మంది ఆరాధించే శ్రీరాముడి చరిత్ర అని చెప్పుకొచ్చారు. ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఎలాగో… హిందువులకు రామాయణం, మహాభారతం అలాంటివని వ్యాఖ్యానించారు.
హిందూమతం, హిందూ దేవుళ్లపై ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతోందని నాగబాబు ఆరోపించారు. నాస్తికత్వం పేరుతో హిందువుల మనోభావాలను కించపరిచేలా ప్రవర్తించేవారు శిక్ష అనుభవిస్తారని అన్నారు. మత విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడితే, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కత్తి మహేష్ పై ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని నాగబాబు కోరారు. కత్తి మహేష్ లాంటి నీచుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లకు చేతులెత్తి మొక్కుతూ నాగబాబు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

మతపరమైన చర్చలను ఎవరూ ప్రోత్సహించొద్దని నాగబాబు సూచించారు. హిందువుల మనోభావాలను కించపరిచిన కత్తి మషేష్‌పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకపోతే చరిత్రాత్మక తప్పు చేసిన వారవుతారని నాగబాబు అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వాలు తేలిగ్గా తీసుకుంటే ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని నాగబాబు హెచ్చరించారు. ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు హిందూ సమాజం ఎలాంటి బాధ్యత వహించదని నాగబాబు తేల్చి చెప్పారు.

ఈ క్రమంలో శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిపై నాగబాబు ప్రశంసల వర్షం కురిపించారు. పరిపూర్ణానంద, చాగంటి లాంటి వారి వల్లే ఇంకా హిందూత్వం బతికే ఉందన్నారు. కత్తి మహేష్ లాంటి హిందూ వ్యతిరేకులపై పరిపూర్ణానంద స్వామి చేస్తున్న ధర్మ పోరాటానికి నాగబాబు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)