పవన్‌పై మళ్లీ ఎటాక్.. 2009 ఎలక్షన్స్ కోసం నన్ను 2014 కోసం ఆమెను పెళ్లి చేసుకున్నాడు.. మేమిద్దరం పెళ్ళికి ముందే తల్లులమయ్యాం.. తాళి కట్టకుండా వదిలేసిన లిస్టు చాల పెద్దది

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకొని సినీ విమర్శకుడు మహేష్ కత్తి వివాదాస్పద పోస్టింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గత కొద్దికాలంగా సద్దుమణిగిందనుకొన్న పవన్, కత్తి వివాదం మళ్లీ రాజుకొన్నట్టు కనిపిస్తుంది. హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం ఓ కేసులో కత్తి ఇరుక్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా రేణుదేశాయ్ పేరుతో ఉన్న ఓ ఇమేజ్‌ను పోస్టు చేసి మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారినట్టు కనిపిస్తున్నది. 
నాస్తికత్వం పేరుతో హిందూ దేవుళ్లను దూషించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఓ ప్రణాళిక బద్దంగా హిందూ మతాన్ని డామేజ్ చేయడానికి కుట్ర జరుగుతున్నది. అలాంటి వారిని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కఠిన చర్యలు తీసుకోవాలని మెగా బ్రదర్ నాగబాబు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం సంచలనం రేపింది. నాగబాబు వీడియో పోస్టు నేపథ్యంలో మహేష్ కత్తి తీవ్రంగా స్పందించారు. రేణుదేశాయ్ పేరుతో ఉన్న ఓ ఇమేజ్‌ను పోస్టు చేయడం వివాదంగా మారింది. ఇట్స్ హై టైమ్ అంటూ కామెంట్ చేయడం గమనార్హం. నా జోలికి వస్తే మీ హీరో అంతు చూస్తా అని ఉండటం వివాదానికి కేంద్ర బిందువైంది. అయితే రేణుదేశాయ్ నిశ్చితార్థం జరిగింది. అయితే రెండో పెళ్లి చేసుకోవడంపై పవన్ ఫ్యాన్స్‌లోని కొందరు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో కాస్త ఘాటుగానే రేణు స్పందించారు. కానీ మహేష్ కత్తి పోస్టు చేసిన ఇమేజ్ ఎక్కడిది? ఏదైనా పేపర్లో వచ్చిందా? అనే విషయాలపై క్లారిటీ లేదు. మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే మహేష్ కత్తి ఈ చర్యకు పాల్పడి ఉంటాడనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు మళ్లీ రెచ్చిపోతారా లేక సహనం పాటిస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఒకవేళ పవన్ అభిమానులు స్పందిస్తే ఈ వివాదం మరింత రచ్చగా మారే అవకాశం ఉంది. 
ఇదిలా ఉండగా, రేణుదేశాయ్ ఇమేజ్‌ను పెట్టిన కత్తి మహేష్ వెంటనే తొలగించారు? సాధారణంగా కత్తి తన పోస్టులను డిలీట్ చేయడు. ఏం జరిగిందో ఏమో గానీ.. ఈ ట్వీట్‌ను కొద్దిసేపటికే తొలగించాడు. ఎవరైనా బెదిరిస్తే భయంతో తీశాడా? లేక ఒత్తిళ్లకు తలవొగ్గి డిలీట్ చేశాడా? అనే ప్రశ్నలకు సమాధానం లభించలేదు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)