ఏ ‘బిగ్‌బాస్’ హౌస్‌మేట్‌కు లభించనంత పారితోషికంతో ‘రతి నిర్వేదం’ భామ శ్వేతా మీనన్ ఎంట్రీ

‘రతీ నిర్వేదం’ సినిమాతో కుర్రకారు కంటి మీద కునుకు లేకుండా చేసిన భారీ అందాల భామ శ్వేతా మీనన్ మలయాళం ‘బిగ్‌బాస్‌’లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రాంతీయ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చిన ‘బిగ్‌బాస్’ షోకు తెలుగులో నాని, తమిళంలో కమల్‌హాసన్, కన్నడలో సుదీప్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. మలయాళంలో మోహన్‌లాల్ వ్యాఖ్యాత. అయితే, ప్రాంతీయ భాషాలు అన్నింటికంటే.. మళయాళం బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన 16 మంది సెలబ్రిటీలకే పారితోషికాలు భారీగా ఇస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ముఖ్యంగా హాట్ అందాలతో కైపెక్కించే నటి శ్వేతా మీనన్‌కు రోజుకు రూ.లక్ష చొప్పున చెల్లించేందుకు నిర్వాకులతో ఒప్పందాలు జరిగినట్లు మల్లువుడ్ వర్గాలు తెలిపాయి. అంటే, దక్షిణాది ‘బిగ్‌బాస్’ హౌస్‌మేట్స్‌లో శ్వేతాకే అత్యధిక పారితోషికం లభిస్తోందన్నమాట! మాజీ మిస్‌ కేరళ, ప్రముఖ యాంకర్‌ రంజిని హరిదాస్‌‌ రోజుకు రూ.80,000 పారితోషికంతో ఆమె తర్వాతి స్థానంలో ఉన్నారు. ఆమె తర్వాత హాస్య నటుడు అనూప్ చంద్రన్ రూ.71,000, నటి పర్ల మానే రూ.50,000 చొప్పున తీసుకుంటున్నారు. ఈ విషయం మన తెలుగు ‘బిగ్‌బాస్’ హౌస్‌మేట్స్‌కు కనుక తెలిస్తే బెంగ పెట్టుకుంటారేమో.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)