బేబీ ఐ లవ్ యూ అంటూ ముద్దు పెట్టడానికి ట్రై చేశాడని

బాలీవుడ్ నటి, ఫెమినిస్ట్, కాస్టింగ్ కౌచ్ లాంటి ఉదంతాలపై నిర్మొహమాటంగా మాట్లాడే బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కాలంగా ఉందని, తాను కూడా వీటిని ఫేస్ చేశానని తెలిపారు. బాలీవుడ్‌కు చెందిన ఓ పెద్ద ప్రొడ్యూసర్ మేనేజర్‌ను అని చెప్పుకున్న ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి ముద్దు పెట్టడానికి ట్రై చేశాడని, బేబీ ఐ లవ్ యూ అంటూ తనను కమిట్మెంట్ అడిగాడని, తన ఇంటి అడ్రస్ చెప్పాలని ఒత్తిడి తెచ్చాడని తెలిపారు. ఇలాంటివన్నీ కూడా కాస్టింగ్ కౌచ్ కిందకే వస్తాయని స్వరభాస్కర్ చెప్పుకొచ్చారు. ఫెమినిజం గురించి మాట్లాడుతూ... సినిమా రంగంతో పాటు చాలా రంగాల్లో లింగ సమానత్వం లేదని, మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించడం లేదని అన్నారు. ఇందులో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. 'వీరే ది వెడ్డింగ్' మూవీలో కరీనా కపూర్, సోనమ్ కపూర్ లతో కలసి స్వరా భాస్కర్ నటించిన సంగతి తెలిసిందే. ఇందులో స్వయంతృప్తి సీన్లలో నటించడం సంచలనం అయింది. ఫెమినిస్ట్ అయిన స్వర భాస్కర్ ఈ సీన్లో నటించడాన్ని సమర్దించుకున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)