నన్ పై కేథలిక్ ఫాదర్ ఏకంగా 13సార్లు రేప్.. అనాథ శరణాలయంలోనే పనికానిచ్చిన ఫాదర్

కేరళలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ సన్యాసినిపై మత గురువు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బాధితురాలు శుక్రవారం కొట్టాయం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులో ఉత్తర భారతదేశానికి చెందిన ఓ డియోసెస్ కేథలిక్ మత గురువు ఇప్పటివరకు 13సార్లు అత్యాచారం చేశాడని పేర్కొన్నారు. తాను మొదటిసారి 2014లో కురవిలాంద్ ప్రాంతంలోని అనాథ శరణాలయం వద్ద అతిథి గృహంలో ఉన్నపుడు అత్యాచారానికి గురయ్యానని తెలిపారు. దీనిపై చర్చి అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఇదిలా ఉండగా తనని బదిలీ చేశాననే కోపంతో నాఫై ఫిర్యాదు చేసిందని మత గురువు కౌంటర్‌ ఫిటిషన్‌ వేశారు. దీనిపై దర్యాప్తు జరిపేందుకు ఎస్పీ ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేరళాకు చెందిన ఆయన 2013 నుంచి డియోసెస్ కేథలిక్ మత గురువుగా వ్యవహరిస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)