45 ఏళ్ల తల్లి, 22 ఏళ్ల కూతురు.. ఇద్దరూ కలిసి 17 ఏళ్ళ కుర్రాడిని సెక్స్ కి వాడుకుంటున్నారని

తన 17 ఏళ్ల కొడుకును వారి ఇంట్లో పెట్టుకుని ఓ తల్లీ కూతరు లైంగికంగా వాడుకుంటున్నారంటూ ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో నేపాల్‌కు చెందిన 45 ఏళ్ల తల్లి, 22 ఏళ్ల ఆమె కూతురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శివ కుమార్ వివరాలు వెల్లడించారు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ కింద ఇద్దరు మహిళలపై కేసులు నమోదు చేశామని ఏఎస్పీ చెప్పారు. మైనర్‌ను వ్యభిచారం కోసం వాడుకోవడం కిందకు ఈ సెక్షన్ వస్తుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం బాధితుడి వయసు 17 సంవత్సరాల 6 నెలలని, అందుకే లైంగిక నేరాల నుంచి పిల్లలకు భద్రత (పోక్సో) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వివరించారు. అయితే నిందితులను అరెస్టు చేయలేదని, ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కుర్రాడి తండ్రి ఫిర్యాదు ప్రకారం.. అతని కొడుకును మహిళ, ఆమె కుమార్తె తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు. మూడు నెలలుగా ఆ కుర్రాడు వారి వద్దే ఉంటున్నాడు. ఈ మూడు నెలలపాటు తల్లీకూతుళ్లు తన కుమారుడిని లైంగికంగా వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ మహిళ భర్త గురించి మీడియా ప్రస్తావించగా.. ఆమె వితంతువా, లేదంటే భర్త నుంచి విడిపోయిందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు చెప్పారు. బాధిత కుర్రాడు కూడా చదువు ఆపేశాడని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని చెప్పారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)