అత్తా నువ్వంటే చాలా మోజు అంటూ.. పిల్లనిచ్చిన అత్తనే కోరిక తీర్చమంటూ వాట్శాప్ లో మెసేజ్

శ్రీకాళహస్త్రికి చెందిన కే.జాన్‌ అదే పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో అటెండెర్‌గా పని చేస్తున్నాడు. 2012లో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన యువతితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో జాన్‌ వ్యవసనాలకు బానిసయ్యాడు. భార్యను శారీరకంగా, మాససికంగా వేధింపులకు గురి చేసేవాడు. పెద్దలు సర్ది చెప్పినా అతని తీరులో మార్పు రాలేదు. 2015లో శ్రీకాళహస్త్రి ఏరియా ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన ఒక రోగి సహాయకురాలి బంధువును లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణ చేసి జాన్‌ను సత్యవేడు ఆస్పత్రికి బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ నేపథ్యంలో జాన్‌ వేధింపులు తాళలేక ఈ ఏడాది జనవరిలో భార్య తన ఇద్దరు కుమారులతో కలిసి చీరాలలోని పుట్టింటికి చేరింది. అప్పటి నుంచి అత్త నాగజ్యోతిని ఫోన్లో అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా లైంగిక వాంఛ తీర్చమని వేధించసాగాడు. నువ్వంటే మోజు నువ్వు ఓకే అంటే నిన్ను బంగారంలో చూసుకుంట.. అంతు లేని స్వర్గం చూపెడతా అంటూ మెసేజ్ పెట్టి వేదించాడు.  చేసేది లేక నాగజ్యోతి చీరాల పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 7వ తేదీన ఫిర్యాదు చేసింది. పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి ఈ నెల 11వ తేదీన నిందితుడు జాన్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సంబంధిత రిమాండు పత్రాలు, కేసు వివరాలను బాధితులు చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ద్వారా పంపి జాన్‌ను సస్పెండ్‌ చేయమని అభ్యర్థించారు. వారు పట్టించుకోలేదు. వారం రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పొంతన లేని సమాధానం చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)