సెక్స్ అనేది ప్రేమను వ్యక్తపరిచే సాధనం.. పెళ్లికి ముందు సెక్స్ తప్పేంకాదే నాకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు

మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రంలో జోడీ కట్టిన కైరా అద్వానీ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈమె నటించిన హిందీ చిత్రం ‘లస్ట్ స్టోరీస్’‌లో శృంగార కోరిక‌లు ఎక్కువ‌గా గ‌ల గృహిణిగా నటించి.. వైబ్రేటర్‌తో స్వయంతృప్తి పొందుతూ ఉన్న సన్నివేశం ద్వారా ఇంటర్ నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీన్‌పై పలు విమర్శలు తలెత్తుతుంటే.. మహిళల లైంగిక వాంఛలకు సంబంధించిన అంశాల్ని తెరకెక్కించడాన్ని ఘోర తప్పిదంగా పరగణించడం కరెక్ట్ కాదంటున్నారు కైరా అద్వానీ. ఆమె వాదనతో ఏకీభవించేవారు లేకపోలేదు కాని.. మరీ ఇంత బోల్డ్‌ స్టేట్ మెంట్ అవసరమా అంటూ కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో మరోసారి సెక్స్ విషయంలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. ‘సెక్స్ అనేది ప్రేమను వ్యక్తపరిచే సాధనం.. దాన్ని బూతుగా చూడాల్సిన అవసరం లేదు. నాకు 15 ఏళ్లు వయసు ఉన్నప్పుడు సెక్స్ ప్రక్రియ గురించే అవగాహన లేక.. అది పెళ్లి తరువాత జరగాల్సిన తంతుగా భావించా. పెళ్లికి ముందు సెక్స్ చాలా తప్పు అని భావించే వాళ్లం. అయితే సినిమాల్లోకి వచ్చిన తరువాత సెక్స్‌పై అభిప్రాయం మారింది. శృంగారం అనేది వాళ్ల వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం అంటూ శృంగారం పాఠాలు చెప్పుకొస్తుంది భరత్ బ్యూటీ. అంతే కాదండోయ్ ఏ మగాడి దగ్గరైతే సువాసనలు వస్తుంటాయో ఆ వ్యక్తుల్ని బాగా ఇష్టపడతా అంటోంది. మరి ఆ వాసనలు ఏంటో.. ఆ ఫ్లేవర్స్ ఏంటో కైరా అద్వానీకే ఎరుక.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)