బస్‌స్టేషన్‌లో ఆ గది నిండా లవర్సే.. వాళ్లు చేస్తున్న పని చూస్తే బిత్తరపోవాల్సిందే

కామాతురానాం..న భయం..న లజ్జ… అన్న చంద ఈ మద్య కొంత మంది ప్రేమికులు బరితెగించి రోడ్లపై, పార్కుల్లో, నిర్మాణుష్య ప్రదేశాల్లో చేస్తున్న విచ్చలవిడితనం సమాజం తలదించుకునేలా చేస్తుంది. ఇక విజయవాడ బస్‌స్టేషన్‌లో ఓ గదిలో వ్యవహారం చూస్తే..వామ్మో ఇది బస్ షెల్టరా..లేక పార్కా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ అధికారులు లింకు టికెట్‌ ప్రయాణికుల సౌకర్యం కోసం పండిట్‌ నెహ్రూ బస్ స్టేషన్‌లో ‘లింక్‌ షెల్టర్‌’ను ఏర్పాటు చేశారు. బస్ స్టేషన్‌ డిపార్చర్‌ బ్లాక్‌లోనే ప్రత్యేకంగా ఈ వేదికను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రయాణికులు కూర్చోవటానికి, సేద తీరటానికి ఏర్పాట్లు చేశారు. బస్ స్టేషన్‌కు, బస్ స్టేషన్‌ నుంచి మరో ప్రాంతానికి కలిపి ఒకేసారి లింక్‌ టికెట్‌ తీసుకునే ప్రయాణికులకు ఈ ప్రత్యేక సౌకర్యం కల్పించారు. ఈ సౌకర్యం వల్ల ఏజ్ లో ఉన్నారు..అలసిపోయిన వాళ్లకు రిలీఫ్ గా ఉంటుందని భావించారు.

అంతే కాదు మార్గమధ్యలో కార్లు, ఆటోలు, మాక్సీ క్యాబ్‌లను ఆశ్రయించకుండా నేరుగా ఆర్టీసీ బస్సుల్లోనే వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆర్టీసీ అధికారులు భావించారు. అంతా బాగానే ఉంది కానీ..ఎంతైనా ఆర్టీసీ సిబ్బందికి అన్ని చూసుకునే తీరికి ఎక్కడుంటుంది..అందుకే పర్యవేక్షణ లోపించింది. అయితే ఈ మద్య కొన్ని ఆరోపణలు వెల్లివెత్తడంతో సదరు అధికారికి వెంటనే గుర్తుకు వచ్చి కొంత మది అధికారులను అక్కడకు పంపించారట. సహాయ అధికారి అక్కడికి వెళ్లి చూడగా… జంటలు తప్ప సాధారణ ప్రయాణికులు ఎవరూ లేరని గుర్తించారు. లింకు షెల్టర్‌లో సేదతీరుతున్న జంటలు సరదాగా ముచ్చట్లలో మునిగిపోవటంతో ఆ అధికారి విస్తుపోయారు. ఏదో చేయాలని చూస్తే..అది ఏదో అయినట్లు..ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనుకుంటే..లవర్స్ స్పాట్ గా మారిపోవడంతో..లింకు షెల్టర్‌ను మూసి వేయించమని ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు ఒకటి తలిస్తే… జరిగిందొకటి కావటంతో అప్పటి నుంచి బస్టేషన్‌లో ఈ లింకు చాలా హాట్‌ గురూ! అని సిబ్బంది నుంచి సెటైర్‌లు వినిపిస్తున్నాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)