ఇద్దరు నటీమణుల మధ్య చిచ్చు పెట్టిన కండోమ్

సరదాకు ఒక హద్దు ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోతే సీన్ ఎలా మారుతుందన్నది తాజాగా ఇద్దరు బాలీవుడ్ నటీమణుల మధ్య నడుస్తున్న గొడవను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. సరదాగా మొదలైన సంవాదం బ్యాలెన్స్ మిస్ అయి సోషల్ మీడియా సాక్షిగా బండబూతులు తిట్టేసుకునే వరకూ వెళ్లిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఇంతకీ ఆ సరదా విషయం ఏమిటి? బండ బూతులు తిట్టేసుకుంటున్న ఇద్దరు నటీమణులు ఎవరు? అన్న విషయంలోకి వెళితే..

మహారాష్ట్రలో ప్లాస్టిక్ వినియోగం మీద బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై టీవీ సీరియల్ నటీ మహికా శర్మ ఇన్ స్టాగ్రామ్ లో సరదాగా ఒక పోస్ట్ చేశారు. సోదరి.. ప్లాస్టిక్ బ్యాన్ గురించి కాస్త అవగాహన పెంచుతావా? కండోమ్ లు కూడా బ్యాన్ అయ్యాయా? అంటూ ఒక మెసేజ్ పెట్టారు. మొదటి క్వశ్చన్ వరకూ అయితే మామూలుగానే ఉండేవారేమో కానీ.. రెండో ప్రశ్న రాఖీకి ఎక్కడో కాలేలా చేసినట్లుంది. అంతే.. ఆమెలోని మరో మనిషి బయటకు వచ్చేశారు. మామూలుగా ఉన్నంతవరకూ బాగానే ఉండే రాఖీ.. ఏ చిన్న తేడా వచ్చినా చెలరేగిపోతారు.ఆ టైంలో ఆమెను ఆపటం ఎవరి తరం కాదంటారు. ఇదే తరహాలోనే సోషల్ మీడియా సాక్షిగా మహికా శర్మను బండబూతులు తిట్టేస్తూ వీడియో సందేశాల్ని వరుస పెట్టి పోస్టు చేసేసింది రాఖీ.

కండోమ్ ల గురించి నాకు ఐడియా ఉంది. అవి ప్లాస్టిక్ తో కాకుండా రబ్బర్ తోనే తయారు చేస్తారన్న రాఖీ.. ఒకవేళ కండోమ్ లు లాంటివి బ్యాన్ చేస్తే మాత్రం మహికా లాంటోళ్లు ఎయిడ్స్ వచ్చి పోతారంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ఏదో సరదాకి మేసేజ్ పెడితే.. మరీ ఇంత దారుణంగా అవమానిస్తుందా? అని ఫీలైన మహికా సీరియస్ గా రిప్లై ఇవ్వటం షురూ చేశారు. మొత్తానికి వీరిద్దరి మధ్య గొడవ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఎంత సరదా అయితే మాత్రం అవతల వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతారో చూసుకోకుండా పోస్టులు పెడితే ఇలాంటివి తప్పవు మరి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)