మరదలిపై కన్నేసిన కరాటే మాస్టర్.. పొదల్లోకి లాక్కెళ్లి..

చట్టాలు పదునెక్కాయి. నిందితులకు కఠిన శిక్షలు పడుతున్నాయి. అయినాసరే కామాంధుల్లో మార్పు మాత్రం రావడం లేదు. మైనర్లపై దారుణాలు ఆగడం లేదు. రోజూ ఏదో ఒక చోట బాలికలపై అకృత్యాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తెలిసినవాళ్లే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఓ దారుణమే ఇందుకు ఉదాహరణ. బాలికపై అత్యాచారం చేసిన ఆ మానవమృగం చేతులకు బేడీలు పడ్డాయి. సమీప బంధువే కామాంధుడు. నమ్మినందుకు నయవంచన చేశాడు. మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఎ బొల్లారంలోని గాంధీనగర్‌లో వెలుగుచూసింది.

పవన్ అనే కరాటే మాస్టర్ తన సమీప బంధువు బాలికపై కన్నేశాడు. 16 ఏళ్ల ఆ బాలికకు మాయమాటలు చెప్పాడు. వరుసకు మరదలు అయిన ఆమెను.. బైక్‌పై ఎక్కించుకున్నాడు. ఏదో సరదాగా తిప్పుతాడని భావించిన ఆ బాలిక దారుణంగా మోసపోయింది. రింగ్‌ రోడ్డు సమీపానికి తీసుకెళ్లిన పవన్.. బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణం గురించి తన తల్లికి చెప్పి బోరుమంది ఆ మైనర్. దీంతో తల్లిదండ్రులు పవన్‌ను నిలదీశారు. కానీ తనకే పాపం తెలియదంటూ బుకాయించాడు. అదంతా అబద్ధమంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మరుసటి రోజు బాధిత బాలిక పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. పవన్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. పవన్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)