కొడుకు ఫోన్ లో సెక్స్ వీడియోస్ చూడటం తల్లి చూసింది ఆ తర్వాత..

కోల్‌కతా : రాత్రివేళ పదహారేళ్ల కుమారుడు స్మార్ట్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తున్నాడని తల్లి ఫోన్ తీసుకోవడంతో ఆవేదన చెందిన కుమారుడు సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కోల్‌కతా నగరంలో వెలుగుచూసింది. కోల్‌కతా నగరానికి చెందిన సత్యరంజన్, మీనూలు భార్యాభర్తలు. వీరు కిరాణా దుకాణం నడుపుతున్నారు. వీరి కుమారుడు సైకత్ (16) మాధ్యమిక పరీక్షల్లో 83 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. కుమారుడు పరీక్షల్లో మంచి మార్కులతో పాసయ్యాడనే సంతోషంతో తల్లిదండ్రులు అతనికి స్మార్ట్ ఫోన్ కొని బహుమతిగా ఇచ్చారు. అంతే కుమారుడు సైకత్ ఎప్పుడూ ఫోన్ తోనే గడుపుతున్నాడు. రాత్రివేళ స్మార్ట్ ఫోన్ లో అశ్లీల వీడియోలు చూస్తున్నాడని తల్లి మీను పరిశీలనలో తేలింది. అంతే ఆగ్రహం చెందిన తల్లి కుమారుడు సైకత్ నుంచి ఫోన్ తీసుకుంది. దీంతో ఆవేదన చెందిన సైకత్ తన గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అందరినీ కలచివేసింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)