పరువు పోతోందని తల్లిని హతమార్చిన కుమారుడు

తన పరువుపోతుందని కన్న తల్లిని దారుణంగా హత్య చేసాడో కొడుకు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి గూడకు చెందిన మమతా కొంతకాలంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తుంస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో వ్యాపారంలో బాగా నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో నష్టాలను పూడ్చేందుకు మమత అప్పులు చేసింది. అయితే అప్పులు ఇచ్చిన వారు తమ డబ్బు తిరిగి ఇచ్చెయ్యమని రోజు ఇంటివద్ద గొడవకు దిగుతున్నారు. దీంతో
తన పరువు పోతోందని భావించిన ఆమె కుమారుడు మదన్‌... తల్లి మమతపై కక్ష పెంచుకున్నాడు. నిన్న అర్ధరాత్రి తల్లిని అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పైకి తీసుకెళ్లి హతమార్చాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మమత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)