‘బ్రాహ్మణుల అమ్మాయి నవాబుల అబ్బాయి’ - ఈ ‘‘షార్ట్ ఫిల్మ్’’ ని నిషేధించండి

సినిమాల్లో తమ మనోభావాలను కించపరిచారంటూ కొన్ని సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఇలాంటి అభ్యంతరమే ఓ షార్ట్ ఫిల్మ్ పై వ్యక్తమౌతున్నాయి. సినిమాలమీద ఇంట్రెస్ట్ ఉన్న చాలా మంది షార్ట్ ఫిల్మ్ లను తీస్తూ.. తమ టాలెంట్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ టీజర్ ని యూట్యూబ్ లో విడుదల చేయగా.. దానిపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి.

హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమకథగా ఈ షార్ట్ ఫిల్మ్ ని తెరకెక్కిస్తున్నారు. అయితే.. ‘బ్రాహ్మణ సమాజాన్ని కించపరచే విధంగా లవ్ జీహాద్ ను ప్రేరేపించే విధంగా నిర్మిస్తున్న ‘బ్రాహ్మణుల అమ్మాయి నవాబుల అబ్బాయి’ లఘు చిత్రాన్ని విడుదల కాకుండా ఆపాలని... సినిమా ట్రయిలర్‌ను యూట్యూబ్ నుంచి సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతున్నారు.

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)