భర్త మర్మాంగంపై సలసల కాగే వేడినీళ్ళలో కారం కలిపి పోసిన భార్య

ఇటీవలి కాలంలో భార్యల చేతిలో భర్తలు చిత్ర హింసలు ఎదుర్కొంటున్నారు. కొందరు భార్యలు అయితే ఏకంగా కట్టుకున్న వాడిని అంతం చేస్తున్నారు. తాజాగా చిన్నపాటి కలహానికే కట్టుకున్న భర్త మర్మాంగంపై సలసల కాగే వేడి నీళ్లలో కారం కలిపి భార్య పోసింది. దీంతో ఆయనకు నడుం కింది భాగం వరకు బాగా కాలిపోవడంతో కేకలు వేస్తూ లబోదిబోమంటూ తల్లడిల్లిపోయాడు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ దారుణాన్ని పరిశీలిస్తే..
జిల్లాలోని దుమ్ముగూడెం మండలం బండారుగూడెంకొత్తగూడెం(బి. కొత్తగూడెం) గ్రామానికి చెందిన కుంజా నర్సయ్య, రాజమ్మ దంపతులకు నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు గతంలో మృతిచెందారు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ వాగ్వాదం జరుగుతుందని, సోమవారం ఉదయం కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. ఆ సమయంలో బయటకు వెళ్లిపోయిన నర్సయ్య.. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చి నిద్రకు ఉపక్రమించాడు.

ఉదయం జరిగిన గొడవతో భర్తపై కోపంతో ఉన్న రాజమ్మ... అర్థరాత్రి సమయంలో నీటిని బాగా వేడి చేసి.. అందులో కారం కలిపి.. గాఢనిద్రలో ఉన్న నర్సయ్యపై పోసింది. దీంతో నర్సయ్య మర్మాంగం, తొడలు బాగా కాలిపోయాయి. ఈ క్రమంలో నర్సయ్య బాగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి.. వెంటనే అతడిని భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అమాయకుడైన భర్తపై రాజమ్మ హత్యాయత్నం చేసిందని గ్రామస్థులు పేర్కొంటుండగా.. ఈ ఘటనపై తమకు ఫిర్యాదేమీ అందలేదని దుమ్ముగూడెం స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)