బాబు గోగినేనిపై దేశద్రోహం కేసు… త్వరలోనే అరెస్టు

బాబు గోగినేని… ఈమధ్యకాలంలో పాపులర్ పేరు ఇది… కొన్నేళ్ల క్రితం మాయమైన బాలసన్యాసిని శాంభవి మళ్లీ ప్రత్యక్షమై తనపై బోలెడు ఆరోపణలు చేసింది… పలు టీవీ డిబేట్లలో నాస్తికుడిగా తన వాదనలు వినిపిస్తూ వచ్చాడు… ఇప్పుడు ఏకంగా బిగ్‌బాస్‌లో తేలాడు… అక్కడ తోటి కంటెస్టెంట్లతో గొడవలు ఎట్సెట్రా… అయితే ఇప్పుడు చెప్పుకునే సంచలన విషయం ఏమిటంటే..? తనపై దేశద్రోహం కేసు నమోదైంది..! నిజమే… సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు… దేశద్రోహం కేసే కాదు… అది వర్తించే 121, 121 ఏ సెక్షన్లతోపాటు 153 ఏ, 153 బీ (మతాలు, ప్రాంతాలు, కులాలు, వర్గాల పేరిట ప్రజల్లో ద్వేషభావనల్ని రేకెత్తించడం), 406 (నేరపూరితమైన నమ్మకద్రోహం), 420 (మోసం), 504 (దురుద్దేశంతో శాంతిని భగ్నపరచడం), 505 (వర్గాల నడుమ శతృభావనల్ని క్రియేట్ చేయడం), 295 ఏ (మతవిశ్వాసాల్ని అవమానించడం), 292, 293 (అనుచితమైన ప్రచారాలు ఏరూపంలోనైనా చేయడం)… ఇన్ని సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు… అంతేకాదు, ఆధార్ కార్డుల చట్టంలోని కొన్ని చాప్టర్లను కూడా నమోదు చేశారు…

బాబు గోగినేని పూర్తి పేరు రాజాజీ రామనాథ్ బాబు గోగినేని… వీరనారాయణ అనే వ్యాపారి ఫిర్యాదు మేరకు, కోర్టు డైరెక్షన్ మేరకు ఈ కేసు నమోదు చేశారు… రకరకాల ఈవెంట్ల పేరిట ఇతరుల ఆధార్ కార్డుల డేటా సేకరించడం ఒక ఫిర్యాదు కాగా… హ్యూమనిస్టు, రేషనలిస్టు, ఎథిస్టు పేరిట ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా మతవిశ్వాసాల్ని కించపరుస్తున్నాడని మరో ఫిర్యాదు… భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలి గానీ దానికి పరిమితులు ఉంటాయనీ, ఇంకొకరి విశ్వాసాల్ని అవమానించడం నేరమేనని ఆ ఫిర్యాదు సారాంశం… తను ఏయే సందర్భాల్లో మతవిశ్వసాల్ని కించపరిచాడో, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడో దాదాపు 28 వీడియోలు, క్లిప్పింగులు జతచేసినట్టు సమాచారం… సో, కేసు సీరియసే… దేశద్రోహం కేసు అంటే అరెస్టు చేయాల్సి ఉంటుంది… తనేమో బిగ్‌బాస్‌లో ఉన్నాడు… మరిప్పుడేం చేయబోతున్నారు..? గత బిగ్‌బాస్‌ సీజన్‌లో ముమైత్ ఖాన్ ఉన్నప్పుడు డ్రగ్స్ విచారణ స్టార్టయింది… అవసరమైతే బిగ్‌బాస్ హౌజుకు వెళ్లి మరీ తీసుకురావాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు… దీంతో ఆమె బయటికి రాక తప్పలేదు… విచారణకూ హాజరు కాక తప్పలేదు… ఇప్పుడు బాబు గోగినేని దర్యాప్తు కోసం ఈ పోలీసులు కూడా బిగ్‌బాస్ హౌజుకు వెళ్లాల్సి ఉంటుందా..? ఈలోపు తనే బయటికి వస్తాడా..? లేక వచ్చేదాకా పోలీసులు నిరీక్షిస్తారా..? ఈ కేసులు కోర్టుల్లో నిలుస్తాయా లేదా అనేది, బాబు గోగినేని తన వాదనల్ని ఎలా సమర్థించుకుంటాడు అనేది వేరే సంగతి… పోలీసులు తమ దర్యాప్తు స్టార్ట్ చేయాల్సిందే కదా… అదీ కోర్టు సూచన మేరకు నమోదు చేసిన సీరియస్ కేసు… తేలికగా వదిలేయలేరు కూడా..! సో, దీనిపై బిగ్‌బాస్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది… కేరళలోనూ ఓ కేసు రీసెంటుగా చెప్పుకున్నాం కదా… పోలీసులు పరారీలో ఉన్నట్టు చూపిస్తున్న ఓ కేసు నిందితుడు అకస్మాత్తుగా బిగ్‌బాస్‌లో ప్రత్యక్షమైతే అది కాస్తా రచ్చ రచ్చ అవుతున్నది… మరి బాబు గోగినేని కేసు ఎలా సాగనుందో..? ఏం మలుపులు తిరగనుందో…
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)