ఒక మహిళను ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఐదుగురు క్రైస్తవ మతబోధకులు రేప్

Loading...
కేరళ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రజలకు సరైన మార్గంలో పెట్టాల్సిన మతబోధకులే దారి తప్పారు. తమ కామ వాంచ తీర్చుకోడానికి ఓ వివాహితపై దారుణానికి పాల్పడ్డారు. బెదిరింపులకు దిగుతూ ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఐదుగురు క్రైస్తవ మతబోధకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ అమానుష ఘటన కేరళలోని కొట్టాయం ప్రాంతంలోని మలంకర సాంప్రదాయ చర్చిలో చోటుచేసుకుంది. బాధితురాలి భర్త ఈ దారుణంపై మాట్లాడుతూ.. మొదట ఓ పాస్టర్ బాధిత మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయాన్ని ఆమె మరో ఫాస్టర్ కు తెలిపి సహయం కోరింది. అయితే అతడు ఆమెకు సాయం చేయకపోగా ఈ విషయాన్ని అందరికి చెబుతానని చెప్పి బెదిరించి అతడు కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా మొత్తం ఐదుగురు ఫాస్టర్లు తన భార్యపై దాడి చేసినట్లు బాధితురాలి భర్త తెలిపాడు.

ఈ దారుణం పై బాధితురాలి భర్త చర్చి సెక్రటరీ బీజూ ఒమన్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాస్టర్లపై చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఐదుగురిని సస్పెండ్ చేసి, ఈ ఘటనపై విచారణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత వారిపై తదుపరి చర్యలు తీసుకుంటామని సెక్రటరీ తెలిపారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...