బిగ్ బాస్2: కౌశల్ భార్య కన్నీటి పోస్టు..


Loading...

బిగ్ బాస్ రెండో వారం కూడా ఆదివారం ముగిసిపోయింది. ఇంటి నుంచి రెండో ఎలిమినేటర్ గా నూతన్ నాయుడు వెళ్లిపోయాడు. చివరి వరకూ ఎలిమినేషన్ లో ఉన్న మోడల్ టీవీ యాక్టర్ కౌశల్ చివరి నిమిషంలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. నిజానికి కౌశల్ ఈ వారం ఎలిమినేట్ అయిపోయేవాడే.. హౌస్ లో అతడు అమ్మాయిలతో ప్రవర్తిస్తున్న తీరు.. దానికి తాజాగా తనీష్ కిరీటీ కలిసి ఏడిపించిన వైనం దుమారం రేపింది. కెప్టెన్సీ టాస్క్ లో కిరిటీ.. కౌశల్ కళ్లల్లో నిమ్మకాయం పిండడం తదితర జుగుప్సాకర పనులు చేశాడు. దీంతో ఇంటిసభ్యులతో పాటు చూస్తున్న ప్రేక్షకుల్లో కూడా కౌశల్ పై జాలి కలిగింది. ఇంటి సభ్యులంతా కలిసి అతడిని టార్గెట్ చేశారని అర్థమైంది. కెప్టెన్సీ టాస్క్ అయిపోయాక కౌశల్ తనపై వస్తున్న విమర్శలకు కుమిలిపోవడం.. కిరిటీని నిలదీయడం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. కౌశల్ లోని నిజాయితీని గమనించి కిరిటీ మోసాన్ని పసిగట్టారు. ఈ నేపథ్యంలో చివరి రెండు రోజుల్లో అతడికి ఓట్ల వాన పడి ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. హోస్ట్ నాని కూడా ఆ గొడవ కనుక జరగకపోయి ఉంటే నువ్వే ఎలిమినేట్ అయిపోయేవాడివని.. గొడవ నీలోని అసలు రూపాన్ని చూపి ఎలిమినేషన్ నుంచి తప్పించిదని వివరణ ఇచ్చాడు.
Loading...

తాజాగా అమ్మాయిల పై చేతులు వేస్తాడు అని ముద్రపడిన కౌశల్ విషయంలో అతడి భార్య నీలిమా స్పందించింది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఈ మేరకు ఉద్వేగభరిత పోస్టు వైరల్ గా మారింది. ‘గడిచిన కొద్దిరోజులుగా బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న పరిణామాలకు నా భర్తను బాధ్యుడిని చేసి హింసిస్తున్న తీరును గమనిస్తున్నా.. ఈ విషయంలో నా భర్తపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన మంచి మనుసున్న వారు.. ఎవరైతే ఆయనను టార్గెట్ చేసి బ్లేమ్ చేస్తున్నారో వారికి ఇవే నా ప్రశ్నలు అంటూ ఎమోషనల్ పోస్టు చేసింది.

కౌశల్ భార్య నీలిమా తన పోస్టులో భర్త గురించి ఇలా పేర్కొంది..

కౌశల్ భార్యగా చెబుతున్నా నా భర్తపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయనలోని నిజాయితీ గల మనసును గుర్తించండి..

ఆయనపై వస్తున్న ప్రతి తప్పుడు ప్రచారాన్ని వింటున్నా.. అది ఎవరు చేస్తున్నారో కూడా చూస్తున్నా.. ఆయనను దిగజార్చేందుకు చేస్తున్న కుట్రలను కూడా పరిశీలిస్తున్నాను.
Loading...

పోయిన వారం కౌశల్ గురించి చాలా తప్పుగా మాట్లాడారు.. అవమానించారు. అయినా కౌశల్ ఎంతో సంయమనం పాటించాడు. అందుకే చివరకు వారం ముగిసే సరికి ఆ ఇంటిలో అతడే మంచి వ్యక్తిగా నిలిచాడు.

ఇంటిసభ్యుల సూటిపోటి మాటలతో అతడు మానసికంగా చాలా డిస్ట్రబ్ అయినా కూడా టాస్క్ లో తన 100శాతం పర్ ఫామెన్స్ ఇచ్చాడు. కానీ శుక్రవారం రాత్రి ఇంటిసభ్యులు శృతిమించి ఆయనను ఓడించేందుకు ఆయన స్థాయిని దిగజార్చేందుకు ప్రయత్నించారు. గతవారం టార్గెట్ చేసి ఇంటినుంచి పంపించేందుకు టార్గెట్ చేశారు. దీప్తిని ఎత్తుకున్నాడని అందరూ ఆయన వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ..?

అతడి భార్యగా.. కౌశల్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది. అతడు ఆడిన విధానం.. గెలిచిన తీరు చూసి గర్వపడుతున్నా.. అతడి అడుగుజాడల్లో అందరూ నడవాల్సి ఉంటుంది.

ఇలా కౌశల్ భార్య తన భర్తకు జరిగిన ప్రతి అవమానాన్ని సంఘటనను వివరిస్తూ ఇంటిసభ్యుల తీరును తప్పుపట్టింది. చివరకు అన్నీ తట్టుకొని నిలబడ్డాడని ప్రశంసించింది. కౌశల్ లాంటి భర్త ఉండడం తనకు గర్వకారణమని చెప్పుకొచ్చింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)