అబ్బాయిలు హీరోయిన్లని.. అమ్మాయిలు హీరోలని.. సినిమా వాళ్లని అనుభవిస్తారా.?


Loading...

టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా తాజాగా టాలీవుడ్ సెలెబ్రెటీల గురించి నోరు పారేసుకుంటున్న వ్యక్తులపై స్పందించారు. ఇటీవల మీడియాలో బాగా పాపులర్ అయ్యి ఇప్పటికీ చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్న వారిని ఉద్దేశించి తమ్మారెడ్డి పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు.
Loading...

‘సినిమా వాళ్లని అందరూ అనుభవించాలని కలలు కంటారు. అబ్బాయిలు హీరోయిన్లని.. అమ్మాయిలు హీరోలని ఊహించుకుంటారు. కానీ ఇలాంటి విషయాలను ఎవరూ బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు’ అంటూ తమ్మారెడ్డి సెటైర్ వేశారు. కానీ కొందరు సోషల్ మీడియాలో - యూట్యూబ్ చానెల్స్ లో నీచమైన కామెంట్స్ చేస్తూ చీప్ పబ్లిసిటీ పొందుతున్నారని తమ్మారెడ్డి విమర్శించారు. తమకు ఆ హీరోయిన్ తో సంబంధం ఉందని.. ఈ హీరోతో ఎఫైర్ ఉందని చెబుతూ దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారని తమ్మారెడ్డి విమర్శించారు.
Loading...

ఇలాంటి వారికి పబ్లిసిటీ కల్పించడం వలన సదురు మీడియాకు యూట్యూబ్ చానెల్స్ కు ఒరిగేదీ ఏమీ లేదని.. ఇలాంటి చర్యల వలన పరపతి పెరగకపోగా.. మీరు కూడా ప్రజల దృష్టిలో చులకన అయిపోతారని తమ్మారెడ్డి హెచ్చరించారు.

ఇష్టం వచ్చినట్టు ఫలానా హీరోతో సంబంధం ఉంది.. ఫలానా హీరోయిన్ తో సంబంధం ఉందని లింకులు ఇస్తే కుదరదని తమ్మారెడ్డి స్పష్టం చేశారు. ఏమైనా ఉంటే సాక్ష్యాలు - ఆధారాలతో ముందుకు రావాలని కోరారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హీరోలు హీరోయిన్ల కుటుంబాలు ఏమవుతాయో ఆలోచించరా అని తమ్మారెడ్డి మండిపడ్డారు. ఇక బిగ్ బాస్ విషయంలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని.. తప్పు చేస్తే వారందరినీ బిగ్ బాస్ లోకి తీసుకుంటారా అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)