గుంటూరు సుభానీ బిర్యానీ.. ఎంత సేపైనా ఎదురుచూస్తాం అంటారు.. ఇప్పటికీ కట్టెల పొయ్యిపైనే వండుతూ శభాష్ అనిపిస్తున్నారు


Loading...

ఆహారప్రియులకు గుంటూరు సుభానీ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుభానీ బిర్యాని పేరు చెబితే చెవులు రిక్కించి వింటూ... మనసులో ఆ నేతి ఘుమఘుమలని ఒక్కసారైనా నెమరేసుకోని వారుంటారా?... ఎంత సేపైనా ఎదురుచూస్తాం. ఆ బిర్యానీ రుచేదో చూసే పోతాం అంటారు సుభానీ బిర్యానీ గురించి తెలిసిన వాళ్లు. చాలామందికి తెలియని విషయమేంటంటే అక్కడ బిర్యానీతో పాటూ కిచిడీది కూడా సంవత్సరాలు తరబడినా మరిచిపోలేని రుచని. అవును... గుంటూరులోని సుభానీ హోటల్‌లో నేతితో చేసిన వంటకాల రుచికి మరే వంటకాలు సరిపోవు అనేది వాస్తవమే. ఈ హోటల్‌ గురించి చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలియని వారు ఉండరంటే నమ్మండి. అక్కడి కిచిడీ, చికెన్‌ బిర్యాని, మటన్‌ బిర్యాని, పాయా, రోటి, కబాబ్‌ రుచులు అద్భుతంగా ఉంటాయంటారు ఫుడ్‌ లవర్స్‌.
Loading...

ఉదయం ఆరున్నరకి మొదలైన హోటల్‌ రాత్రి తొమ్మిదిన్నరైనా తెరిచే ఉంటుంది. అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మాత్రం ఆ రద్దీని తట్టుకోవడం కష్టమే. ఆ సమయంలో కూర్చుందామన్నా చోటులేనంతగా రద్దీ ఉంటుంది. ఈ హోటల్‌ బిర్యానీ, పాయా, కబాబ్‌లకు ఎంత పేరో కిచిడీకి అంతే ప్రత్యేకం. ఎంత నాన్‌వెజ్‌ని ఇష్టపడే వారయినా సరే కిచిడీని తినకుండా వెళ్లలేరు. అదే ఈ హోటల్‌ ప్రత్యేకత. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కిచిడీ అందుబాటులోనే ఉంటుంది. స్వచ్ఛమైన నేతితో చేస్తారు కాబట్టే దీనికా రుచి. దీంతోపాటూ నంచుకోవడానికి పెరుగు చట్నీ, కలియా, గోంగూర కూర, చికెన్‌ గ్రేవీ ఇస్తారు. ప్రతిరోజు 100కిలోల బియ్యాన్ని కిచిడీ కోసమే ఉపయోగిస్తారట. జగపతి బాబు, వేణు, జయప్రకాశ్‌రెడ్డి, దర్శకుడు బాబీ వంటి వారికి సుపరిచితమైన రుచి ఈ సుభానీ కిచిడీ.
Loading...

నిమిషాల్లో వంటను పూర్తిచేసే ఆధునిక యంత్రాలు ఎన్ని ఉన్నా.. సుభానీ హోటల్లో మాత్రం ఇప్పటికీ కట్టెల పొయ్యిపైనే వంటకాలు చేస్తారు. వంటకు కావాల్సిన మసాలాలని స్వయంగా నూరుకుంటారు. కల్తీలేకుండా జాగ్రత్తపడతారు. ఇంతకీ సుభానీ ఈ బిర్యానీ సెంటర్‌ని ప్రారంభించడానికి వెనుక ఉన్న కథ చెప్పనే లేదు కదూ... 2001లో ఓ చిన్న బండిపై కిచిడీ, కబాబ్‌ల అమ్మకం ప్రారంభించారాయన. అప్పట్లో వాటి ధర ప్లేటు రూ.10. వాటి రుచిని మరిచిపోలేని వినియోగదారులు చాలామంది రోజూ ఇక్కడికి వచ్చి తినిపోయేవారు. క్రమంగా వ్యాపారం విస్తరించింది. 2012లో ఇది ఒక హోటల్‌గా రూపం సంతరించుకుంది. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చే వారి సంఖ్యా పెరిగిపోయింది. ‘వినియోగదారులకు నాణ్యతలో ఎటువంటి లోటు రాకుండా, రుచికరమైన ఆహారం అందించడమే నా విజయరహస్యం. ప్రస్తుతం కిచిడీ ఒక ప్లేటు రూ.70. ఒక వ్యక్తికి సరిపోయేదాని కంటే ఎక్కువగానే ఇస్తాం అని’ అంటున్నారు హోటల్‌ యజమాని షేక్‌ సుబానీ.నిమిషాల్లో వంటను పూర్తిచేసే ఆధునిక యంత్రాలు ఎన్ని ఉన్నా.. సుభానీ హోటల్లో మాత్రం ఇప్పటికీ కట్టెల పొయ్యిపైనే వంటకాలు చేస్తారు. వంటకు కావాల్సిన మసాలాలని స్వయంగా నూరుకుంటారు. కల్తీలేకుండా జాగ్రత్తపడతారు. ఇంతకీ సుభానీ ఈ బిర్యానీ సెంటర్‌ని ప్రారంభించడానికి వెనుక ఉన్న కథ చెప్పనే లేదు కదూ... 2001లో ఓ చిన్న బండిపై కిచిడీ, కబాబ్‌ల అమ్మకం ప్రారంభించారాయన. అప్పట్లో వాటి ధర ప్లేటు రూ.10. వాటి రుచిని మరిచిపోలేని వినియోగదారులు చాలామంది రోజూ ఇక్కడికి వచ్చి తినిపోయేవారు. క్రమంగా వ్యాపారం విస్తరించింది. 2012లో ఇది ఒక హోటల్‌గా రూపం సంతరించుకుంది. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చే వారి సంఖ్యా పెరిగిపోయింది. ‘వినియోగదారులకు నాణ్యతలో ఎటువంటి లోటు రాకుండా, రుచికరమైన ఆహారం అందించడమే నా విజయరహస్యం. ప్రస్తుతం కిచిడీ ఒక ప్లేటు రూ.70. ఒక వ్యక్తికి సరిపోయేదాని కంటే ఎక్కువగానే ఇస్తాం అని’ అంటున్నారు హోటల్‌ యజమాని షేక్‌ సుబానీ.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)