(వీడియో) రైల్వే స్టేషన్‌లో కానిస్టేబుల్ నిద్రిస్తున్నట్టు నటిస్తూ మహిళను ఎక్కడెక్కడో టచ్ చేశాడు


Loading...

దేశవ్యాప్తంగా మహిళలపై రోజూ లైంగిక వేధింపులు సాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ మహిళ పట్ల ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తనలోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. అదీకూడా పబ్లిగ్గా. అందరూ చూస్తుండగానే అమ్మాయిని తాకాలని అనుకున్నాడు. ఆమెను ఏదేదో చేయాలనుకున్నాడు. సీసీ కెమెరాల్లో అంతా రికార్డ్ అయ్యింది. అలాగే అక్కడున్న ఒక ప్రయాణికుడు దీన్ని మొత్తం వీడియో తీశారు.
Loading...

ముంబైలోని కళ్యాణ్‌ రైల్వే స్టేషన్‌లో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో ఇద్దరు మహిళలు ఆరో నంబర్ ప్లాట్‌ఫాంపై ఉన్న సీట్లలో కూర్చుని రైలు కోసం ఎదురుచూస్తున్నారు. వీరి పక్కనే రాజేశ్ జహంగీర్ అనే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కూర్చుని ఉన్నాడు. జహంగీర్ పక్కన కూర్చున్న మహిళ ఉక్కపోతగా ఉండటంతో టవలత్ బాబుకు గాలి విసురుకుంటోంది. ఇక కానిస్టేబుల్ నిద్రిస్తున్నట్టు నటిస్తూ పక్కనే కూర్చున్న మహిళను అభ్యంతరకరంగా తాకాడు. అంత మంది స్టేషన్‌లో ఉన్నారన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా ఆ మహిళపై కావాలని చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ వికృత చేష్టలను ఆ మహిళ పక్కనే కూర్చున్న మరో మహిళ గమనించింది.
Loading...

ఆ తర్వాత ఆ మహిళ వారించగా మరో ప్రయాణీకుడు, మరికొందరు అతడికి దేహశుద్ధి చేశారు. దీంతో మిగిలిన ప్రయాణికులు కూడా తలోచేయి వేసి దేహశుద్ధి చేశారు. అలా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసోడే దారి తప్పాడు. కామంతో కళ్లు మూసుకుపోయి మహిళతో వెకిలి వేషాలు వేశాడు. ఇదంతా అక్కడి ప్రయాణికులు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
అయితే దీనిపై విచారణ జరిపి కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామని డివిజినల్ కమిషనర్ సెంట్రల్ రైల్వేస్ సచిన్ భలేడ్ పేర్కొన్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, వీడియో ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)