నాన్నా నన్ను క్షమించు.. అన్నీ అయిపోయాక ఇప్పుడు వద్దంటున్నాడు..


Loading...

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని శనివారం ఓ బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. లోయారాణి అనే విద్యార్థిని ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రాణి రాసిన సూసైడ్‌ నోట్‌ కేసులో కీలకంగా మారింది. ప్రేమించిన అబ్బాయి ఫోన్‌ నెంబర్‌ను రాణి లెటర్‌లో పేర్కొంది. పోలీసులు దాని ఆధారంగా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Loading...

రాణి సూసైడ్‌ నోట్‌లో ‘ నాన్న నేను తప్పు చేశాను. నువ్వు అనుకున్నట్లుగానే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అన్నీ అయిపోయాక నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నన్ను మోసం చేశాడు. అందుకే నేను చనిపోతున్నాను. నా ముఖం మీకు చూపించలేను. నేను చేసిన దానికి నన్ను క్షమించు నాన్న.’ అంటూ పేర్కొంది.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)