ప్రియుడి మోజులో పడి జ్యూస్‌లో విషం కలిపి కట్టుకున్న భర్తనే


Loading...

భారతీయ సంతతి చేందిన మహిళకు ఆమె ప్రియిడుకి మెల్బోర్న్‌లోని ఆస్ట్రేలియన్ కోర్టు 20 సంవత్సరాలకు పైగా జైల్ శిక్ష విధించింది. 2015లో సోఫియా అనే మహిళ ఆమె భర్తను ప్రియిడుతో కలిసి జ్యూస్‌లో విషం కలిపి హతమార్చారు. రెండేళ్లుగా ఈ కేసును విచారించిన కోర్టుసోఫియా(34)కు 22 సంవత్సరాలు ఆమె ప్రియిడు అరుణ్ కమలసనాన్‌(36)కు 27 ఏళ్ళపాటు శిక్షను విధించింది. జస్టిస్ పాల్ కోగ్లన్ తీర్పుని ఇస్తూ "ఇది చాలా తీవ్రమైన హత్య నేరం"అని తన జడ్జ్‌మెంట్‌లో పేర్కొన్నారు.
Loading...

అరుణ్‌తో సోఫియా పరిచయం -కేరళకు చెందిన అరుణ్‌ కమలాసనన్‌, సోఫియా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. వీరి స్నేహం చివరకు ప్రేమగా మారింది. కానీ ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. సోఫియాకు సామ్‌ అబ్రహంతో కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. సామ్‌ అబ్రహం భార్యతో కలిసి అస్ట్రేలియాలో స్దిరపడ్డారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అరుణ్‌కు కూడా మరో అమ్మాయితో పెళ్లైంది.
Loading...

అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లైన తర్వాత కూడా సోఫియా, అరుణ్‌లు చాటు ప్రేమ వ్యవహరం జరిపారు.అరుణ్‌ భార్యా పిల్లల్ని వదిలి పెట్టి 2013లో ఆస్ట్రేలియా చేరుకున్నాడు. అప్పటి నుంచి వారిద్దరూ రహస్యంగా కలుసుకునేవారు. ఈ క్రమంలో సామ్‌ అడ్డు తొలగించుకోని జీవితాంతం తామిద్దరం కలిసి ఉండొచ్చని భావించిన అరుణ్‌.. సోఫియాతో సామ్‌ను హత్య చేసేందుకు పథకం వేశాడు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)