ఎంతో మంది మ‌గాళ్లు ఉండ‌గా ఆ సీన్ చేశా.. ఆ హాట్ సీన్ గురించి మాట్లాడిన కియారా


Loading...

`ధోనీ`, `భ‌రత్ అనే నేను` సినిమాల్లో ప‌క్కింటమ్మాయి త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించిన కియారా ఆడ్వాణీ తాజాగా విడుద‌లైన `ల‌స్ట్ స్టోరీస్‌`లో బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించింది. బిడియ‌స్తుడైన భ‌ర్త‌కు భార్య‌గా, శృంగార కోరిక‌లు ఎక్కువ‌గా గ‌ల గృహిణి పాత్ర‌లో కియారా న‌టించింది. పాత్ర ప‌రిధి దృష్ట్యా కొన్ని హాట్ సన్నివేశాల్లో కియారా న‌టించింది. ముఖ్యంగా `స్వ‌యంతృప్తి` వంటి బోల్డ్ సీన్స్‌లో కియారా న‌టించింది.
Loading...

ఇటీవ‌ల `వీరే ది వెడ్డింగ్‌` సినిమాలో స్వ‌ర‌భాస్క‌ర్ కూడా ఇలాంటి సీన్‌లో న‌టించి విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. తాజాగా కియారాకు కూడా విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. దీని గురించి తాజాగా కియారా స్పందించింది. `ఇది పూర్తిగా పెద్ద‌ల కోసం తీసిన సినిమా. మొద‌ట నాకు స్క్రిప్టు చెప్పిన‌ప్పుడు ఈ సీన్ లేదు. షూటింగ్ స‌మ‌యంలో ఈ సీన్ యాడ్ చేశారు. ఆ సీన్ చేస్తేనే స‌బ్జెక్ట్‌కు న్యాయం చేసిన‌ట్టు అవుతుంద‌ని నాకు అనిపించింది. చిత్ర‌బృందం చాలా స‌హ‌క‌రించింది కాబ‌ట్టే.. ఎంతో మంది మ‌గాళ్లు ఉండ‌గా ఆ సీన్‌లో న‌టించాను. ఆ సీన్ చేసినందుకు నేను ప‌శ్చాత్తాపం చెంద‌డం లేద‌`ని కియారా చెప్పింది.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)