భర్త స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం..అచ్చం సినిమా స్టోరీలా


Loading...

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కడతేర్చాలని చూసింది భార్య... అందుకోసం పక్కా స్కెచ్‌ వేసింది...భర్తకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో అతనిపేరుపై రెండున్నర లక్షల రూపాయలతో రెండు ఇన్సూరెన్స్ పాలసీలు చేయంచింది... భర్తను హతమార్చేందుకు కిరాయి గూండాలను పురమాయించింది... అయితే ఈ కుట్రను భగ్నం చేశాడు భర్త... అచ్చం సినిమా స్టోరీని తలపిస్తోన్న ఈ ఘటన రియల్‌గా జరిగింది....
Loading...

పశ్చిమగోదావరి జిల్లా జంగారె్డి గూడెంకు చెందిన కొండపల్లి వెంకటేశ్వరరావు ట్రాక్టర్స్‌ రిపేర్‌ వర్క్‌ చేస్తుంటాడు... వేగవరం గ్రామానికి చెందిన రామకృష్ణ ట్రాక్టర్‌ అమ్మకాలు, కొనుగోళ్లలో బ్రోకర్‌గా వ్యవహరిస్తుంటాడు... ఈ క్రమంలో వెంకటేశ్వరరావు, రామకృష్ణల మధ్య స్నేహం కుదిరింది... అయితే రామకృష్ణ వెంకటేశ్వరరావు భార్య దివ్యతో పరిచయం పెంచుకున్నాడు... అది అక్రమ సంబంధానికి దారితీసింది.. ఈ నేపథ్యంలో వారికి వెంకటేశ్వరరావు అడ్డుగా మారాడు....
Loading...

వెంకటేశ్వరరావు అడ్డును తొలగించుకునేందుకు తన క్రిమినల్‌ మైండ్‌కు పదును పెట్టిన దివ్య సమయం కోసం ఎదురు చూసింది... అయితే భార్యప్రవర్తనలో తేడాను గమనించిన వెంకటేశ్వరరావు నిఘా పెట్టాడు... ఈ క్రమంలో ఏలూరు నుంచి రామకృష్ణ, దివ్య కారులో చింతలపూడి వస్తున్నారన్న సమాచారంతో వెంకటేశ్వరరావు నలుగురు స్నేహితుల సహాయంతో వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. స్థానికులు వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు..
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)