వీరమాచినేని డైట్.. బహుపరాక్.. బహుపరాక్.. పది మందికీ షేర్ చేయండి.. ఎందుకంటే, ఇది ప్రాణాలకు సంబంధించింది కాబట్టి


Loading...

వీరమాచినేని డైట్…! ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడెక్కడో ఉన్న తెలుగు సమూహాల్లోనూ విపరీతంగా పాపులరైన పేరు… జీవనశైలి వ్యాధులు ప్లస్ సైలెంట్ కిల్లర్లయిన మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర వ్యాధులకు ఓ పరిష్కారంగా చూపించబడుతున్న వీరమాచినేని డైట్… ఇప్పుడు లక్షల మంది దాన్ని పాటిస్తున్నారు… సూత్రరీత్యా వీరమాచినేని డైట్ ఆచరణకు అత్యుత్తమమే… నిజానికి అది కొత్త సిద్ధాంతమేమీ కాదు… వీలయినంతవరకూ మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించేసి, దేహానికి సరిపడా శక్తి కోసం ఇతర కొవ్వు పదార్థాలు తీసుకోవాలీ అనేది ఇందులో సూత్రం… అది ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు ఆమోదిస్తున్న పద్ధతే… కీటో డైట్, లో కార్బ్-హై ఫ్యాట్ డైట్ వంటి పేర్లతో ఇప్పటికే ఆచరణలో ఉన్నవే… ఎందుకు..? సుగర్ వచ్చినవాళ్లలో క్లోమం మనకు సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతున్నది కాబట్టి, ఇన్సులిన్ అవసరాన్నే తగ్గించేయడం, అంటే ఇన్సులిన్ అవసరమయ్యే పిండిపదార్థాలనే తగ్గించేయడం… తద్వారా బరువు తగ్గుతారు ప్లస్ సుగర్, బీపీలు తగ్గుతాయి అనేది అంతఃసూత్రం…
Loading...

అయితే ఈ కేలరీల లెక్కలు, ఏది తినాలి, ఏది తినొద్దు అనేది అందరికీ అంత సులభంగా అర్థం కాదు కాబట్టి… వీరమాచినేని ఫలానా ఆహారం ఫలానా మోతాదులో తీసుకోవాలి, ఫలానా పదార్థాలు అవాయిడ్ చేయాలి అంటూ దాన్ని ఓ ఫార్ములాగా మార్చాడు… అదీ తన డైట్ విజయరహస్యం… నిజానికి మంచిదే… కానీ… బహుపరాక్… బహుపరాక్… మీకిష్టం వచ్చినట్టు చేస్తే అనుకోని ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది… ఎలాగంటే..? వీరమాచినేని డైట్‌నే పలువురు ఆయుర్వేద వైద్యులు రోగులకు సూచిస్తున్నారు… వాళ్లు తోచిన పద్దతులతో పాటిస్తున్నారు… 
చూశారు కదా… కడియం శ్రీహరి మేనకోడలు నిమ్స్‌లో చేరింది… ఎందుకు..? సుగర్ మందులు మానేసి, ఈ డైట్ పాటించడం మొదలు పెట్టింది… గ్లూకోజు లెవల్స్ సరిగ్గా చెక్ చేసుకోట్టుంది… దీంతో సుగర్ పెరిగిపోయి కోమాలోకి వెళ్లిపోయింది… సమయానికి చికిత్స చేశారు కాబట్టి సరిపోయింది… సేమ్, ఇలాగే నిమ్స్‌కే కాదు, ఇతర హాస్పిటల్స్‌కూ పలు కేసులు వస్తున్నాయి… ఆమధ్య విజయనగరంలో ఒక యువకుడు మరణించాడు కూడా..! అన్నిచోట్లా దాదాపు ఒకే కారణం… మందులు మానేసి, కొబ్బరినూనె తెగతాగేస్తుండటం..! ఇతర అంశాల్ని ఇగ్నోర్ చేయడం…! అది ఈజీ మెథడ్ కాబట్టి… ఇక్కడే మరో విషయం… కొందరు బోగస్ వైద్యులు కొబ్బరినూనెనే అద్భుత తైలం పేరిట ప్రచారం చేసి అంటగడుతున్నారు… అది తాగేవాళ్లు ఇతర జాగ్రత్తలు, పద్ధతులు గాలికి వదిలేస్తున్నారు… మరీ మరీ ప్రమాదం… బహుశా కడియం మేనకోడలి విషయంలో ఇదే జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు కూడా..! నిజానికి ఆయుర్వేద వైద్యులు కూడా ఇప్పుడు వీరమాచినేని డైట్ సూచిస్తున్నారు… అద్భుత తైలాలకూ వీరమాచినేని డైట్‌కూ నడుమ తేడాల్ని, ఈ డైట్ అసలు సూత్రాన్ని అర్థం చేసుకుని…, కొంచెం కామన్ సెన్స్‌తో గనుక ఈ డైట్ పాటిస్తే అది బ్రహ్మాండంగా ఫలితాన్నిస్తుంది… కాకపోతే ఇప్పటిదాకా డాక్టర్లు వద్దన్న ఆహారాన్నే ఇక్కడ ఈ డైట్ పద్ధతిలో ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి కాస్త కేర్‌ఫుల్‌గా ఉండాలి…
Loading...

ఎలాగూ చెప్పాడు కదాని… కొబ్బరినూనె తెగతాగేయడం కాదు, అది లేకుండా కూడా ఈ డైట్ నిక్షేపంగా పాటించవచ్చు… మరోసారి ఆ సూత్రం అర్థం చేసుకొండి… శరీరానికి కార్బొహైడ్రేట్లను దూరం చేయడం, అంటే పిండిపదార్థాలను దూరం చేయడం మొదటి సూచన… అంటే బియ్యమే గాకుండా రాగులు, సజ్జలు, జొన్నలు ఎట్సెట్రా మానేయాలి… అంటే అన్నం, రొట్టెలు ఓ నిర్ణతగడువు వరకూ మానేయాలి (2 నెలలు, 3 నెలల తరువాత కొద్దికొద్దిగా తీసుకోవచ్చు…) మరి తిండి..? మన దేహానికి శక్తి ఎలా..? దానికి ఈ డైట్ చెప్పేది ఏమిటంటే..? ఫ్యాట్స్ ..! వాటి నుంచి వచ్చే శక్తి సరిపోతుంది… పిండిపదార్థాలు మానేస్తే ఆటోమేటిక్‌గా సుగర్ లెవల్స్ తగ్గుతాయి కాబట్టి, ఇంకా అదనంగా సుగర్ మందులు వేసుకుంటుంటే అది లోసుగర్‌కు దారితీస్తుంది కాబట్టి, ఈ కోర్సు సమయంలో ఆ మందులు వేసుకోవద్దూ అంటారు… అలాగే సుగర్ మందులు మానేసి, పిండిపదార్థాలను యథావిధిగా తీసుకుంటే సుగర్ లెవల్స్ పెరిగి, అదీ ప్రమాదకరమే అవుతుంది… అందుకే ఈ కోర్సు ప్రారంభించాక రక్తంలో సుగర్ లెవల్స్ ఎక్కువసార్లు చెక్ చేసుకుంటూ, ఈ డైట్ కంటిన్యూ చేయడం చాలా చాలా బెటర్…

ఈ డైట్‌ను అక్షరాలా అదే ఫార్ములాతోె పాటించాలని కాదు, మనకు అనువైన పద్ధతిలో స్వల్ప మార్పులు చేసుకోవచ్చు… మనం చేయాల్సిందల్లా మనకు కావల్సిందేమిటో గుర్తించి, ఆచరించడం..! అంతేతప్ప ఒక్క కొబ్బరినూనె తాగేస్తే సరిపోదు… దాని బదులు వెన్నపూస, వెన్న, నెయ్యి, పాలమీద మీగడ నిక్షేపంగా తీసుకోవచ్చు… గుడ్లలోని పచ్చసొన డేంజర్ అనే పాత సిద్ధాంతాన్ని ప్రపంచ స్థాయిలో నిపుణులు ఇప్పుడు మార్చేస్తున్నారు, అది మరీ అంత ప్రమాదకరమేమీ కాదు అని తేల్చేస్తున్నారు కాబట్టి గుడ్లు తీసుకోవచ్చు… నాన్ వెజిటేరియన్స్ అయితే మరీ మంచిది… మటన్, చికెన్ తీసుకోవచ్చు… ఫిష్ అయితే మరీ బెటర్… పిండిపదార్థాలు లేని, పరిమిత కేలరీలతో అన్నిరకాల పోషకాలూ లభించే ఫుడ్ అది… ఇంకా దేహానికి ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు కావాలి కాబట్టి కొన్ని గింజల్ని సజెస్ట్ చేస్తారు… అంతే తప్ప అన్నం మానేసి, కొబ్బరి నూనె తాగితే సరి అనే భ్రమల నుంచి అర్జెంటుగా బయటపడాలి… అన్నింటికన్నా బెటర్ ఏమిటంటే..? మనకు అర్థమైనట్టుగా పాటించేయడంకన్నా ఈ డైట్‌తో హాయిగా ఫలితాలు పొందుతున్న వారి నుంచి సూచనలు తీసుకోవడం..! ఈ పిండిపదార్థాలు తగ్గించేసి, కొవ్వుల ద్వారా కొంత శక్తిని తీసుకుంటాం కదా, అదీ సరిపోక మన శరీరం తనలో నిల్వ ఉన్న మన కొవ్వుల్నే కరిగించుకోవడం స్టార్ట్ చేస్తుంది… తద్వారా బరువు తగ్గుతాం… బరువు తగ్గడం అనేది మధుమేహానికి, బీపీకి మంచిది… అయితే వీటికి తోడు కాస్త వ్యాయామం, స్ట్రెస్ తగ్గించుకోవడం కూడా మంచిది… తీసుకునే ఆహారాన్ని కూడా పరిమితంగా తీసుకోవడం మరీ మరీ అవసరం… సో, మంచిదే కానీ జాగ్రత్త… జాగ్రత్త
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)