రైల్వేస్టేషన్‌లో యువతి చూస్తుండగానే ఊహించని విధంగా లుంగీని తొలగించి ఆ యువతిని చూస్తూ హస్త ప్రయోగం


Loading...

ఆడవారిపై లైంగిక వేధింపులు ఏ విధంగా పెరుగుతున్నాయో.. వారి ముందు కొందరు పురుషులు చేసే వెకిలి చేష్టలు కూడా అంతేస్థాయిలో పెరుగుతున్నాయి. వారి వెకిలి చేష్టలకు సిగ్గుతో తలదించుకుని వెళ్లిపోయే మహిళలే ఎక్కువగా ఉండటంతో కొందరు రెచ్చిపోతున్నారు. కేరళలో ఓ యువతికి ఎదురైన ఘటనే ఇందుకు నిదర్శనం.
Loading...

కేరళలోని కన్హన్‌గడ్ రైల్వే స్టేషన్‌లో మంగళూరు రైలు కోసం కవిత అనే ఓ యువతి ఎదురుచూస్తుండగా నడి వయస్సు కలిగిన ఓ వ్యక్తి వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. ఆ యువతి చూస్తుండగానే ఊహించని విధంగా లుంగీని తొలగించి ఆ యువతిని చూస్తూ హస్త ప్రయోగం చేయసాగాడు. అలాంటి దృశ్యం కళ్ల ముందు కనిపిస్తే సహజంగా మహిళలు సిగ్గుతూ అక్కడి నుంచి తిట్టుకుంటూ వెళ్లిపోతారు. కానీ కవిత అలా వెళ్లిపోలేదు. అతనికి తగిన బుద్ధి చెప్పాలనుకుంది. ఫోన్‌లో అతని ఫొటో తీసింది. అయితే కేవలం ఫొటో తీస్తే అతనికి బుద్ధి రాదని భావించిన కవిత అతని కాలర్ పట్టుకుని ఇవేం పనులంటూ చెంప చెళ్లుమనిపించింది. దీంతో ఆ వ్యక్తి కవిత కాళ్లపై పడ్డాడు. ఇంకెప్పుడూ ఇలా చేయనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Loading...

ఈ ఉదంతాన్నంతా ప్లాట్‌ఫాంపై ఉన్న వారు చూసినప్పటికీ ఒక్కరూ కూడా తనకు మద్దతుగా రాలేదని కవిత తన ఫేస్‌బుక్‌లో జరిగిందంతా పోస్ట్ చేసింది. వెకిలిచేష్టలకు పాల్పడిన ఆ వ్యక్తి ఫొటోను పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. ఆ వ్యక్తి గురించి కవిత ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగానే.. చాలామంది మహిళలు స్పందించారు. అదే రైల్వేస్టేషన్‌లో తమతో కూడా ఇలాగే ప్రవర్తించాడంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. కేరళలో ఇలాంటి ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాను ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి మంగళూరు వెళుతున్నానని.. తిరిగొచ్చాక ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కవిత తెలిపింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)