(వీడియో) లైవ్ ఇస్తుండగా.. ఆమె గుండెల్ని చేతితో గట్టిగా పట్టుకుని.. ముద్దెట్టాడు


Loading...

సాకర్ పోటీలు జరుగుతున్న వేళ క్రీడాభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వరల్డ్ కప్ సాకర్ పోటీలు జరుగుతున్న రష్యాకు వెళ్లిన కొలంబియా మహిళా జర్నలిస్టుకు వింత అనుభవం ఎదురైంది. లైవ్ రిపోర్ట్ ఇస్తుండగా ఓ గుర్తు తెలియని యువకుడు ఆమె గుండెల వద్ద చేతితో గట్టిగా పట్టుకుని.. బుగ్గపై ముద్దెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బాధితురాలు సోషల్ మీడియాలో పంచుకుంది.
వివరాల్లోకి వెళితే.. జర్మన్ న్యూస్ చానల్‌లో పనిచేస్తున్న జూలియట్ గోంజాలెజ్ థెరాన్ అనే యువతి పనిచేస్తుంది. సాకర్ వరల్డ్ కప్‌ కోసం ఆమె రష్యాకు వెళ్లింది. ఈ క్రమంలో సరన్స్ ప్రాంతంలో నిలబడి లైవ్ రిపోర్టు ఇస్తుండగా, గుర్తు తెలియని ఓ యువకుడు వచ్చి, ఆమెకు బుగ్గపై ముద్దు పెట్టి వెళ్లాడు. అదే సమయంలో ఆమె గుండెల వద్ద చేత్తో గట్టిగా పట్టుకున్నాడు.
Loading...

ఈ సంఘటనపై అప్పటికప్పుడు స్పందించలేకపోయిన జూలియట్.. తన లైవ్ కవరేజ్‌ని కొనసాగించింది. తాను లైవ్ రిపోర్టు ఇచ్చే ఉద్దేశంతో అంతకు రెండు గంటల ముందు నుంచి అదే ప్రాంతంలో ఉన్నానని చెప్పింది. లైవ్ ఇస్తున్నప్పుడు వెంటనే రియాక్ట్ కాబోనని తెలుసుకున్న ఆ వ్యక్తి ఈ పని చేసి వెళ్లాడని బాధితురాలు సోషల్ మీడియాలో వెల్లడించింది.
Loading...

ఆపై ఎంతో సేపు అతని గురించి వెతికినా కనిపించలేదని చెప్పింది. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ మహిళా జర్నలిస్టుకు రక్షణ కల్పించడంలో రష్యా విఫలమైందని నెటిజన్లు విమర్శస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)