ఆధార్‌ని ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోండిలా


Loading...

మొబైల్‌, పాన్‌, బ్యాంకు ఖాతా.. ఇలా అన్నింటికీ ఆధార్‌ను అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. రైల్లో ప్రయాణించడానికి, బస్సు టికెట్‌ బుక్‌ చేయడానికి దీన్ని గుర్తింపు కార్డుగా వాడుతున్నారు. అంతేకాదు పలు సేవలకూ ఇదివరకే ఆధార్‌ను మీరు వినియోగించి ఉంటారు. అలా వినియోగించిన ఆధార్‌ను ఎవరైనా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని మీరు భావిస్తే.. గతంలో మీరు ఎప్పుడు.. ఎక్కడ మీ ఆధార్‌ను వినియోగించారో తెలుసుకోవచ్చు. ఇందుకోసం విశిష్ఠ గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఓ సదుపాయాన్ని కల్పిస్తోంది. మీకు ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఆధార్‌ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో లాక్‌ చేసుకోవచ్చు.
Loading...

ఇలా తెలుసుకోండి..
♦ ముందు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోని అథంటికేషన్‌ హిస్టరీ పేజీలోకి వెళ్లాలి.
లింక్‌:https://resident.uidai.gov.in
♦ అక్కడ మీ ఆధార్‌ నెంబర్‌ను, సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేయాలి.
♦ జనరేట్‌ ఓటీపీపై క్లిక్‌ చేయాలి.
♦ ఆ తర్వాత మీ మొబైల్‌కు ఓటీపీ నంబర్‌ వస్తుంది. దాన్ని వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేయండి.
♦ మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వివరాలు కావాలనుకుంటున్నారో అక్కడ ఉన్న తేదీని ఎంచుకోండి.
♦ తేదీ, సమయంతో సహా ఆధార్‌ ఇచ్చిన వివరాలను మీరు చూడొచ్చు. గరిష్ఠంగా ఆరు నెలల క్రితం వరకు ఇచ్చిన వివరాలను పొందొచ్చు.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)