మూత్రం రంగుతోనే చెప్పేయవచ్చు ఆరోగ్య సమస్య ఏంటో.. మాత్రం రంగుల గురించి మీకు తెలుసా..?


Loading...

మూత్రం చిక్కదనం, రంగు, వాసనలు మన ఆరోగ్య పరిస్థితికి అద్దాల్లాంటివి. వీటి మీద అవగాహన ఏర్పరుచుకుంటే రుగ్మతలను ప్రారంభంలోనే గుర్తించవచ్చు. మరి మీ మూత్రంలో ఏ మర్మం దాగుంతో గ్రహించండి!
Loading...


Loading...

పారదర్శకం: మరీ నీళ్లలా పారదర్శకంగా ఉందంటే మీరు అవసరానికి మించి ద్రవాలు తీసుకుంటున్నారని అర్ధం. ఇదంత భయపడాల్సిన పరిస్థితి కాదు. కానీ ఓవర్‌ హైడ్రేషన్‌ వల్ల శరీరంలోని లవణాలు బయటికి వెళ్లిపోయి, రక్తంలో రసాయనిక అసమతౌల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది.
Loading...

లేత పసుపు: సమంగా ద్రవాలు తీసుకుంటున్నారని అర్ధం. ఈ రంగు మీరు ఆరోగ్యంగా ఉన్నారనడానికి సూచన.

ముదురు పసుపు: మీరు తగినన్ని నీరు తాగట్లేదని అర్ధం. ఫలితంగా మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశమూ ఉంటుంది. ఘనాహారం తక్కువ పరిమాణాల్లో తీసుకుంటూ ఆ స్థానాన్ని నీటితో భర్తీ చేయండి.

తేనె రంగు: మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురయిందని అర్థం.

ఎరుపు: మూత్రంలో రక్తం కలిసే ‘హెమటూరియా’ లక్షణమిది. వెంటనే యూరాలజిస్ట్‌ని కలవండి. ఇన్‌ఫెక్షన్‌, మూత్రపిండాల వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రనాళంలో కేన్సర్‌ గడ్డలు ఉన్నా మూత్రం ఎర్రగా మారుతుంది. ప్రోస్టేట్‌ గ్రంథిలో సమస్య తలెత్తినా మూత్రం ఎర్రగా ఉంటుంది.

నీలం: ‘హైపకాల్సీమియా’ (బ్లూ డైపర్‌ సిండ్రోమ్‌) అనే మెటబాలిక్‌ డిజార్డర్‌లో మూత్రం నీలంగా మారుతుంది.

ముదురు గోధుమ/నలుపు: కాపర్‌ పాయిజనింగ్‌ లేదా మెలనోమా రుగ్మతలకు గురైతే మూత్రం ఈ రంగుల్లోకి మారుతుంది. సాధ్యమైనంత త్వరగా వైద్యుల్ని కలవాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)