కన్న కూతుళ్ళతో సెక్స్ రాకెట్... తల్లిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించిన తండ్రి


Loading...

కాన్పూర్: ఒక తండ్రి తన ఇంట్లో జరుగుతున్న సెక్స్ రాకెట్‌ను బయటపెట్టారు. తన భార్యతోపాటు ముగ్గురు కుమార్తెలపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వలపన్ని ఒక యువకుడిని అనుమానాస్పద స్థితిలో పట్టుకున్నారు. మరో యువకుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.
Loading...

చాలాకాలంగా ఇక్కడ ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కాగా నౌబస్తా ఇన్‌స్పెక్టర్ సంతోష్‌సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్నామని ఆందోళనకారులను శాంతింపజేశారు. వివరాల్లోకి వెళితే ఉత్తర‌ప్రదేశ్‌లోని నౌబస్తా పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఒక గ్రామంలో ఒక వ్యక్తి తన కుటుంబంతో పాటు ఉంటున్నాడు. అయితే అతని భార్య, కుమార్తెలు అతన్ని బయటకు వెళ్లగొట్టారు. దీంతో అతను ఢిల్లీలో ఉంటుండగా, భార్య పిల్లలు ఇక్కడ ఉంటున్నారు.
Loading...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన సందర్భంలో అతని ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించాడు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)