షాకింగ్ సెక్స్ రాకెట్ విషయంలో హీరోయిన్ మెహ్రీన్‌‌‌‌ను విచారించిన అమెరికా అధికారులు


Loading...

అమెరికాలో సెక్స్ రాకెట్ నడుపుతున్న తెలుగు సినీ నిర్మాత మోదుగుమూడి కిషన్, అతడి భార్య చంద్ర అరెస్టు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో తెలుగు సినీ తారలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూఎస్ఏ వస్తున్న తెలుగు స్టార్లను అధికారులు ఎయిర్‌పోర్టులో నిలిపివేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా తన తల్లిదండ్రులను కలిసేందుకు కెనడా నుండి అమెరికా వెళ్లిన హీరోయిన్ మెహ్రీన్ కౌర్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
Loading...


మెహ్రీన్ ప్రస్తుతం పంతం సినిమాలోనటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కెనడాలో జరుగుతుండగా... మూడు రోజుల గ్యాప్ రావడంతో తన తల్లిదండ్రులను కలిసేందుకు వాంకోవర్ నుండి యూఎస్ఏ బయల్దేరింది. ఆమె అమెరికాలో ల్యాండ్ అయిన వెంటనే యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ & ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇటీవల వెలుగు చూసిన తెలుగు సెక్స్ రాకెట్ గురించి విచారించారు.
Loading...

‘నా తల్లిదండ్రులను కలవడానికి వాంకువేర్‌ నుంచి అమెరికాకు వెళుతుండగా నేను తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నటిని అని తెలిసి ఇమ్మిగ్రేషన్‌‌ అధికారులను నన్ను నిలిపివేశారు. సెక్స్‌ రాకెట్‌కు సంబంధించి నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. దాంతో నేను షాకయ్యాను' అని మెహ్రీన్ వాపోయారు.

తెలుగు సినిమా నిర్మాత అమెరికాలో సెక్స్ రాకెట్ నడుపుతూ అరెస్టయిన విషయం ఎయిర్ పోర్టులో అధికారులు చెప్పే వరకు తనకు తెలియదని మెహ్రీన్ తెలిపారు. తరచూ నేను అమెరికా వెళుతుంటాను, ఇలాంటి విచారణ గతంలో తాను ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆమె అన్నారు.

మెహ్రీన్‌తో పాటు మరో ముగ్గురు హీరోయిన్లను కూడా అమెరికా అధికారులు దాదాపు 6 గంటల పాటు విచారించినట్లు సమాచారం. మోదుగుమూడి కిషన్‌ -చంద్ర అరెస్టు తర్వాత అమెరికా వెళ్లే ప్రతి తెలుగు యాక్టర్ విచారణ రూపంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)