మెగాస్టార్ కు అల్లుళ్ల‌తో టెన్ష‌న్! మ‌ళ్లీ కొట్లాట త‌ప్ప‌దు


Loading...

మెగా స్టార్ చిరంజీవిని ఆ మ‌ధ్య కొడుకు వ‌రుణ్ తేజ్, మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ బాగానే టెన్ష‌న్ పెట్టారు. కొడుకు స‌క్సెస్ అయ్యాడ‌ని ఆనంద‌ప‌డాలో? అల్లుడు ఫెయిల‌య్యాడ‌ని బాధ‌ప‌డ‌లో తెలియక సందిగ్ధంలో ప‌డ్డారు చిరు. వ‌రుణ్ తేజ్ న‌టించిన `తొలిప్రేమ‌`, సాయిధ‌రమ్ తేజ్ న‌టించిన `ఇంటిలిజెంట్` సినిమాలు ఒకేసారి విడుద‌ల‌య్యాయి. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌రుణ్ విజ‌య‌ఢంకా మెగించ‌గా, సాయి చ‌తికిల‌ప‌డ్డాడు.
Loading...

నిర్మాత‌కు న‌ష్టాలు త‌ప్ప‌లేదు. అదే కొంచెంగా గ్యాప్ తీసుకుని వ‌చ్చుంటే న‌ష్టాలు ఆ రేంజ్ లో ఉండేవి కావు. పోటీప‌డి దిగ‌డంతో మొత్తం సీన్ రివ‌ర్స్ అయింది. ఈ వ్వ‌వ‌హారం చిరంజీవి వ‌రకూ వెళ్ల‌డంతో ఫ‌లితంగా ఇద్ద‌రు తిట్లు తినాల్సి వ‌చ్చింది. మ‌న మెగా హీరోలు న‌టించిన సినిమాలు ఎప్పుడూ ఒకే రోజు విడుద‌ల కాకుడ‌దు. అయితే? ఇలాగే ఉంటుంద‌ని గ‌ట్టిగానే క్లాస్ పీకారు. అటుపై మెగా అభిమానులు బాగా ఫీల‌య్యారు.
Loading...

అయితే మ‌రోసారి సాయిధ‌ర‌మ్ తేజ్ ఏకంగా చిరంజీవి సొంత అల్లుడు క‌ళ్యాణ్‌ దేవ్ తోనే పోటీకి సిద్ద‌మ‌వుతున్నాడు. క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా వారాహి బ్యాన‌ర్లో నిర్మాణం అవుతోన్న `విజేత` చిత్రాన్ని జులై 6న రిలీజ్ చేస్తున్నారు.ఈ ముహూర్తం ముందుగా అనుకుని పెట్టినది. అయితే అదేరోజు సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయుకుడిగా న‌టించిన `తేజ్ ఐల‌వ్ యు` సినిమా కూడా రిలీజ్ చేయ‌డానికి ముహూర్తం పెట్టారు.

వాస్త‌వానికి ఇప్ప‌టికే ఈ సినిమా ప‌లుమార్లు వాయిదా ప‌డింది. చివ‌రికి ఈనెల 29న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ ఆ తేదీ కూడా కుద‌ర‌క‌పోవ‌డంతో జూలై 6కి వ‌స్తున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. ఒక రోజు అటు ఇటుగా కూడా కాక‌పోవ‌డం..ఒకే రోజు ఇద్ద‌రి సినిమాలు రిలీజ్ కావ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. బాక్సాఫీస్ వ‌ద్ద చిరు అల్లుళ్లు ఇద్ద‌రు పోటీ ప‌డుతున్నార‌ని బాహాటంగా ముచ్చ‌టించుకుంటున్నారు.

తేజ్ సినిమా నిర్మాత‌కె.ఎస్ రామారావు. సీనియ‌ర్ నిర్మాత‌. చిరంజీవి కి బాగా ఆప్తుడు. కావాల్సిన వారు. అటు అల్లుడ్ని ప‌రిచ‌యం చేస్తున్న‌ది సాయి కొర్ర‌పాటి.అత‌నితో అంత సాన్నిహిత్యం లేదు. చిరు తో రిలేషన్ కోసం అత‌గాడు చిరు అల్లుడ్ని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో చిరు ఎవ‌రి సినిమాని వాయిదా వేసుకోమ‌ని కోర‌లేరు. ఒక‌వేళ స‌ముదాయించాల్సి వ‌స్తే కె.ఎస్ రామారావునే బుజ్జ‌గించాల్సి వ‌స్తుంది. అప్పుడే ఆ సినిమా వెన‌క్కి త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. లేదంటే బాక్సాఫీస్ వ‌ద్ద కొట్లాట త‌ప్ప‌దు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)