తండ్రిని చెట్టుకు కట్టేసి తల్లీ కూతుళ్లపై గ్యాంగ్‌రేప్‌


Loading...

ఆ తండ్రి, తల్లి, కూతురు తమ దారి వెంట తాము వెళ్తున్నారు! అడ్డుగా 20 మంది దుండగులు ఎదురుపడి.. తుపాకులతో బెదిరించి.. తండ్రిని చెట్టుకు బంధించి.. ఆయన కళ్లముందే తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణం బిహార్‌లోని గయా జిల్లాలో వెలుగుచూసింది. గయాలో వైద్యుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి బుధవారం రాత్రి తన భార్య, కూతుర్ని తీసుకొని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు.
Loading...

కోంచ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సోందిహా గ్రామం మీదుగా వెళ్తుండగా నిర్మానుష్య ప్రదేశంలో 20 మంది యువకులు తుపాకులతో బెదిరించి వారిని అడ్డుకున్నారు. వైద్యుడ్ని చెట్టుకు కట్టేసి.. ఆయన భార్య, కూతురుపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. వారి వద్ద నుంచి విలువైన వస్తువులను ఎత్తుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. సోందిహాలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గ్రామం నుంచి నిందితులు పారిపోకుండా స్థానికులు నలుదిక్కులా కాపుగాసి.. పోలీసులకు సహకరించారు. ఇదే గ్యాంగ్‌.. సామూహిక అత్యాచార ఘటనకు ముందు సోందిహాలోనే ఇద్దరు విద్యార్థుల నుంచి మొబైల్‌ ఫోన్లు, డబ్బులు ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు.
Loading...

ఈ గ్రామం మీదుగా వెళ్లేవారిపై దుండగులు గత కొంతకాలంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తన పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఇంత జరుగుతున్నా పట్టించుకోని కోంచ్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎస్‌హెచ్‌వో (స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌)ను పోలీస్‌ ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం బీజేపీతో చేతులు కలిపిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేవారే కరువయ్యారని మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ఆరోపించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)