అమెరికాలో టాలీవుడ్ హీరోయిన్స్‌తో వ్యభిచారం


Loading...

ఎన్నో ఆశలతో.. హీరోయిన్ గా వెలిగిపోవాలని.. ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న కొంతమంది తారల పరిస్థితి తారుమారువుతోంది. తెరపై తళుక్కుమని వెలిగే జీవితాల వెనుక.. ఓ వికృత క్రీడ దాగివుంది. అవకాశాల కోసం ఎదురుచూసే హీరోయిన్లకు.. డబ్బు ఆశ చూపించి గాలం వేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. ఇండియాలో కాదు.. ఏకంగా అమెరికాలోనే హైటెక్ వ్యభిచారం నడిపిస్తున్నారు.
Loading...

తాజాగా..అమెరికాలో.... యూఎస్ ఇన్వెస్టిగేటర్స్ జరిపిన దర్యాప్తులో.. టాలివుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అవాక్కయ్యే నిజాలు బయిటపడ్డాయి. టాలివుడ్ హీరోయిన్స్ తో.. వ్యభిచారం చేయిస్తున్న ఇద్దరు భారతీయ దంపతులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. టాలివుడ్ లో.... సినిమాలకు కో-ప్రోడ్యూసర్ గా వ్యవహరిస్తున్న.. కిషన్ మోదుగుమూడి అనే వ్యక్తితో పాటుగా అతని భార్య చంద్రని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చికాగో డిస్ట్రిక్ట్ కోర్ట్ లో ఈ కేసు నడుస్తోంది.
Loading...

అమెరికాకు..ఈవెంట్స్ కోసం వెళ్లే టాలివుడ్ హీరోయిన్స్ కి గాలం వేయడమే పనిగా పెట్టుకున్నారు.. కిషన్, చంద్ర దంపతులు. టాలివుడ్ లో కో-ప్రొడ్యూసర్ కావడంతో.. తనకున్న పరిచయాలతో హీరోయిన్స్ ని మభ్యపెట్టి.. డబ్బు ఆశ చూపించి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాడు. రీసెంట్ గా..ఓ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన.. ఓ టాలివుడ్ చిన్న హీరోయిన్ ని డబ్బు ఆశ చూపించి మభ్యపెట్టడానికి ప్రయత్నించాడు కిషన్. అయితే ఆ హీరోయిన్ అందుకు ఒప్పుకోలేదు. అక్కడితో ఆగకుండా అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన యూఎస్ ఇన్వెస్టీగేటర్స్.. కూపీ లాగారు. ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్న బాగోతాన్ని బయిటపెట్టారు.

యూఎస్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో దిమ్మతిరిగే విషయాలు బయిటపడ్డాయి.. కల్చరల్ ఈవెంట్స్ కోసం అమెరికా వెళ్లే గ్రూప్ మెంబర్స్ తో పాటుగా.. అమెరికాలో కాన్ఫెరెన్స్ లు నిర్వహించే వ్యాపారవేత్తలకు.. హీరోయిన్స్ ని ఎరగా వేసి భారీగా డబ్బులు పోగేసుకుంటున్నారు..సెక్స్ రాకెట్ లో ప్రధాన నిందితులుగా ఉన్న కిషన్, చంద్ర దంపతులు. ఇలా ఒక్కొక్కరి దెగ్గర.. మూడు వేల డాలర్లు వసూల్ చేస్తున్నారట. టాలివుడ్ హీరోయిన్స్ తో అమెరికాలో వ్యభిచారం జరుగుతోందని బయిటపడటంతో.. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురవుతోంది. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న తారల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)