ఈ బస్సు ఎక్కితే.. గంటన్నరలో శ్రీవారి దర్శనం


Loading...

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి నిత్యం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తిరుపతి చేరుకుంటారు. నెల ముందే ఏర్పాట్లు చేసుకునేవారు కొందరైతే.. సిఫారసు లేఖలు.. కాలి నడకన వచ్చేవారు.. 300 రూపాయల టిక్కెట్లు ఇలా ఏ మార్గంలో వెళ్లే వారిదైనా ఒకటే లక్ష్యం వెంకన్నను వీలైనంత త్వరగా దర్శించుకోవడం.. ఇలాంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.
Loading...

ఈ నెలాఖరు నుంచి ప్రారంభంకానున్న ఏపీటీడీసీ బస్సు ఎక్కితే.. గంట నుంచి గంటన్నర లోపే వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవచ్చని టూరిజం శాఖ తెలిపింది. ప్రభుత్వ సంస్థకావడంతో.. ఈ బస్సులో వెళ్లే యాత్రికులకు సులువుగా దర్శన ఏర్పాట్లు చేయించేందుకు టీటీడీ అధికారులతో టూరిజం శాఖ అధికారులు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది.
Loading...

ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా విశాఖపట్నం నుంచి తిరుమలకు ఈ ఆఫర్ ఉంటుందని.. ఇందులో 43 సీట్లు ఉంటాయని.. రానుపోను ఛార్జీ మొత్తం కలిపి ఒక్కొక్కరికి రూ.4 వేలు ధరను నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖలో బయలుదేరే ఈ బస్సు తర్వాతి రోజు ఉదయం తిరుపతికి వెళుతుందని.. అక్కడే యాత్రికులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించి.. శ్రీవారి దర్శనం అనంతరం శ్రీకాళహస్తిలో దర్శనం తర్వాత విశాఖకు బయలుదేరుతుందని పర్యాటక శాఖ తెలిపింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)