2500 మంది మహిళలు ఒంటి మీద ఎలాంటి దుస్తులు లేకుండా సముద్రంలో ఈత కొట్టారు


Loading...

2505 మంది ఐరిష్ మహిళలు బీచ్‌లో దుస్తులు విప్పేసి నగ్నంగా సముద్రంలో ఈత కొట్టారు. ఒంటి మీద ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఈత కొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ‘స్కిన్నీ డిప్‌’ పేరిట శనివారం వారంతా ఇలా ఈత కొట్టడం వెనుక ఓ మంచి లక్ష్యం ఉంది. కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల కోసం విరాళాలు రాబట్టడం కోసం వారిలా చేశారు.
Loading...

2015లో పశ్చిమ ఆస్ట్రేలియాలో 786 మంది మహిళలు ఈ ‘స్కిన్నీ డిప్‌’లో పాల్గొన్నారు. ఇప్పటి వరకూ ఇదే వరల్డ్ రికార్డ్ కాగా.. తాజాగా ఐర్లాండ్ మహిళలు మఘేరామోర్ బీచ్‌లో దాన్ని బ్రేక్ చేశారు.
Loading...

ఇలా నగ్నంగా సముద్రంలో ఈదడం ద్వారా నిధులు రాబట్టాలనే ఆలోచన డబ్లిన్‌కి చెందిన డీ ఫీదర్‌స్టోన్‌ది. బ్రెస్ట్ కేన్సర్ కారణంగా 2013లో ఆమె రొమ్మును తొలగించగా.. కొద్ది వారాల తర్వాత ఆమె ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే స్కిన్నీ డీప్ ద్వారా 1.53 లక్షల యూరోల మేర నిధులు రాబట్టారు.

నా భర్త ముందు తప్ప మరెవరి ముందూ ఇలా దుస్తులు విప్పలేదు. కానీ ఓ గొప్ప పని కోసం మిగతా మహిళలతో కలిసి ఇలా చేశానని బెట్సన్ అనే మహిళ తెలిపింది. ఈ ఏడాది వచ్చిన డబ్బులను జిమ్మీ నార్మన్, మిక్ రోచ్‌ఫోర్డ్ ఏర్పాటు చేసిన అవొయిభెయాన్ పింక్ టై అనే సంస్థకు ఛారిటీగా ఇవ్వనున్నారు. అవొయిభెయాన్ 8 ఏళ్ల క్రితం కేన్సర్‌తో కన్నుమూసింది. ఆమె జ్ఞాపకార్థం పింక్ టైని ఏర్పాటు చేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)