తన భార్యతో పడక గదిలో శృంగార దృశ్యాలను సెల్‌ఫోన్‌లో రికార్డు


Loading...

హైదరాబాద్ : పడక గదిలో రహస్యంగా ఉండాల్సిన విషయాలను రికార్డు చేసి భద్ర పరుచుకోవాలనుకుంటే ఎప్పటికైనా అవి ప్రమాదాన్ని తెచ్చే అవకాశాలుంటాయి.. పరువు పోవడమే కాకుండా.. బయటకు వెళ్లిన రికార్డులు ఇంటర్‌నెట్‌లోకి ఎక్కి మానసికంగా దంపతులను కృంగదీస్తాయి. వ్యక్తిగతమైన వ్యవహారాలు ఇంటికే పరిమితం చేసుకోవాల్సి ఉండగా.. కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఓ వైద్యుడు ఆశ్రయించి తన బాధను వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Loading...

రెండేళ్లుగా అతని వ్యక్తిగతమైన వీడియోలు ఇంటర్‌నెట్‌లో తిరుగుతున్నాయి.. ఒక వెబ్‌సైట్ నుంచి తొలగిస్తే.. మరో వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్నాయి. ఇలా వాటిని తొలగించేందుకు సదరు వైద్యుడు చేయని ప్రయత్నం లేదు.. అయినా పూర్తిస్థాయిలో ఇంటర్‌నెట్ నుంచి తొలగించలేని నిస్సాయ స్థితిలో ఆ వైద్యుడు ఉన్నాడు...
Loading...

వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు, తన భార్యతో పడక గదిలో శృంగార దృశ్యాలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. రికార్డు చేసిన వీడియోలను వెంటనే డిలీట్ చేయకుండా వాటిని ఫోన్‌లో భద్ర పరిచాడు. కొన్ని రోజుల తరువాత అతను ముంబైకి వెళ్లాడు. అక్కడ ఫోన్ పోయింది. దీంతో సిమ్ బ్లాక్ చేసి, కొత్త సిమ్‌ను కొని మరో ఫోన్‌ను వాడుతున్నాడు. కొన్నాళ్లకు అతని వ్యక్తిగతమైన వీడియోలు అశ్లీల వెబ్‌సైట్‌లో ఉన్నాయి. సెల్‌ఫోన్‌లోని సుమారు 10 వీడియో క్లిప్‌లు ఆయా వెబ్‌సైట్లలో దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని తెలిసినవారి ద్వారా తెలుసుకున్న వైద్యుడు ఖంగుతిన్నాడు. తన వ్యక్తిగతమైన పడకగది దృశ్యాలు ఇంటర్‌నెట్‌లోకి ఎలా వెళ్లాయని ఆరా తీశాడు. దీంతో సెల్‌ఫోన్ దొరికిన వ్యక్తులే అందులోని వీడియోలను చూసి అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసి ఉంటారని అనుమానించాడు. సెల్‌ఫోన్ పోవడం.. ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ కావడం.. బాధితుడికి తెలియడానికి రెండేళ్ల సమయం పట్టింది. దీంతో సెల్‌ఫోన్ ఎవరికి దొరికింది.. ఎవరు చేశారనే విషయంలో వైద్యుడు తిరగని చోటు లేదు. చివరికి హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసులు వెంటనే స్పందించి ఆయా వెబ్‌సైట్ లింకులను వెంటనే డిలీట్ చేయాలంటూ ఆయా వెబ్‌సైట్ సంస్థలకు లేఖలు రాయడంతో వాటిని డిలీట్ చేశారు. ఎక్కడి నుంచి ఈ వీడియోలు అప్‌లోడ్ అయ్యాయని ఆరా తీయగా... ఢిల్లీ నుంచి అప్‌లోడ్ అయ్యాయని తేలింది. ఆప్‌లోడ్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్‌ను పోలీసులు సంపాదించారు. అయితే అప్పటికే సమయం ఆలస్యం కావడంతో.. ఆప్‌లోడ్ చేసిన వ్యక్తి పాత ఫోన్ నెంబర్‌ను తీసేశాడు. పోలీసులకు లభించిన నెంబర్ వాడుకలో లేదని తేలింది. ఈ క్రమంలోనే మరో వెబ్‌సైట్‌లో ఆ వీడియోలు ఆప్‌లోడ్ కావడంతో బాధితుడు తిరిగి హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)