పిల్లాడికి హార్లిక్స్ ఇస్తున్నారా..? మరోసారి ఆలోచించండి


Loading...

నిజంగానే కాస్త కలవరం కలిగించే వార్త… అనేక ఏళ్లుగా హార్లిక్స్ అంటే కోట్ల మందికి ఓ నమ్మకం… అది పిల్లల బరువు పెంచుతుందనీ, కండరాల పటుత్వాన్ని పెంచుతుందనీ, రోగనిరోధకశక్తిని పెంచుతుందనీ, పొడవు పెంచుతుందనీ, రక్తాన్ని పెంచుతుందనీ, బ్రెయిన్ పవర్ పెంచుతుందనీ, ఎముకల గట్టితనాన్ని పెంచుతుందనీ… బహుశా ఆ కంపెనీ యాడ్స్ చూసీ, చదివీ, వినీ ఆ భ్రమల్లో అబద్ధాల్నే నిజమని నమ్మి మోసపోతున్నామా..? నిజంగా హార్లిక్స్ పిల్లలకు మంచిది కాదా..? అది తెలియకుండా మన పిల్లలకు మనం కోట్ల డబ్బాల హార్లిక్స్ తాగిస్తూ, కంపెనీకి వేల కోట్లు ధారబోశామా..? అసలేమిటీ వార్త..? మన టీవీల్లో రాదు, మన పత్రికల్లో రాదు, మన సోషల్ మీడియాలోనూ రాదు… ఏమిటది..? హార్లిక్స్‌పై ఓ వార్త… అదేమిటో కాస్త వివరంగా తెలుసుకుందాం…
Loading...

మే 31… పదిరోజుల క్రితం అమితాబ్ బచ్చన్ వరుసగా మూడు ట్వీట్లు చేశాడు… ఏమనీ అంటే..? ఇదుగో ఇది చూశారు కదా, అదే… హార్లిక్స్ కోసం ఓ ప్రచారం చేయబోతున్నాడు… దాని పేరు మిషన్ పోషణ్ అట… అందులో ఏం చెబుతారంటే..? పిల్లలకు బాగా హార్లిక్స్ పట్టించండీ అని చెబుతారు… ఎందుకు..? మన దేశంలో పిల్లలంతా పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారు… కేంద్ర ప్రభుత్వం కూడా ఓ మంచి కార్యక్రమం తీసుకున్నదీ, దాని పేరు పోషణ్ అభియాన్… దాని స్ఫూర్తితో మనం మిషన్ పోషణ పేరిట హార్లిక్స్ తాగిద్దాం పిల్లలకు… అదీ ఆయన ట్వీట్ల సారాంశం…ఇది అన్యాయం కదా… కేంద్రం సంకల్పించి పోషణ్ అభియాన్ అనేది పిల్లలకు అంగన్‌వాడీ, బాల్‌వాడీ కేంద్రాల ద్వారా మరింత పౌష్టికాహారాన్ని ఓ ఉద్యమస్పూర్తితో అందించాలనే పథకం… అలాంటి పథకాన్ని కూడా తమ హార్లిక్స్ అమ్మకాల కోసం వాడేసుకుంటూ, ప్రజల్ని దాన్ని కూడా ఓ సర్కారు కార్యక్రమమని అనుకునేలా మభ్యపెడుతూ, తప్పుదోవ పట్టిస్తూ ప్రచారం చేయడం అన్యాయం కదా… దానికి బిగ్ బీ వంటి అత్యంత ప్రజాదరణ కలిగిన ఓ పెద్దమనిషి డబ్బు కక్కుర్తితో సహకరించడం అన్యాయం కదా… నిజానికి ఇదే అమితాబ్ 2014లో పెప్సీ ప్రచార కంట్రాక్టు నుంచి వైదొలిగాడు… ఎందుకంటే..?
Loading...

అది ప్రజారోగ్యానికి మంచిది కాదని తెలిసిందట… మరి ఆ స్ఫూర్తి హార్లిక్స్ విషయంలో ఎందుకు కనబరచడం లేదు తను..? అవును, ఇదే ప్రశ్న వేశారు కొందరు మేధావులు… Nutrition Advocacy in Public Interest, a national think tank on nutrition అమితాబ్ బచ్చన్‌కే ఓ బహిరంగ లేఖ రాశారు… మీరు తక్షణం ఆ ప్రచారం నుంచి బయటపడండి ప్లీజ్ అంటూ..! అందులో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కేశవ్ దేశిరాజు కూడా ఒకరు… అందుకే ఆ లేఖకు క్రెడిబులిటీ ఉంది, విలువ ఉంది, ప్రాముఖ్యం ఉంది… ఆమెతోపాటు పలువురు డాక్టర్లు కూడా ఉన్నారు ఆ లేఖ రాసినవారిలో… కేంద్ర ప్రభుత్వ పథకానికీ, హార్లిక్స్ ప్రచారానికీ లింకు పెట్టడం దుర్మార్గమే, వోకే, కానీ అది పిల్లలకు మంచిది కాదనీ, యూజ్‌లెస్ అని ఎలా అంటారు అనేది ఓ కీలకప్రశ్న… అంతేకదా… వాళ్లు చెబుతున్నదేమిటంటే..? ‘‘హార్లిక్స్ మరీ అధికంగా సుగర్ ఉన్న ఓ ప్రొడక్టు… 100 గ్రాముల సరుకులో 78 గ్రాములు కార్బొహెడ్రేట్లు, అదీ 32 గ్రాముల సుక్రోజు సుగర్‌ను ఉత్పత్తి చేస్తుంది… ఈ స్థాయి సుగర్ పిల్లలకు హానికరం… చిన్నతనంలోనే ఒబెసిటీకి దారితీస్తుంది ప్లస్ దీర్ఘకాలికంగా ఇతర వ్యాధులకూ అది కారణమవుతుంది… (పిల్లల ఇన్‌టేక్‌లో 10 శాతం సుగర్ మించి ఉండకూడదు, 5 శాతం బెటర్ అని గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది… మరి హార్లిక్స్ ఎడాపెడా తాగిస్తే ఆ పరిమితి దాటేయడమే కదా… అసలు హార్లిక్స్ చెప్పుకునే పౌష్టిక విలువలు శాస్త్రీయంగా నిరూపితమే కావడం లేదు… 2016లో ప్రపంచ ఆరోగ్య కూటమి (WHA) ఓ తీర్మానం చేసింది… దానిప్రకారం 6 నుంచి 36 నెలల పిల్లలకు ఇచ్చే ఫుడ్స్‌పై అసలు వాణిజ్య ప్రచారమే ఉండకూడదు… దానిప్రకారం చూసినా హార్లిక్స్ ప్రచారం, అమితాబ్ ప్రచారం తప్పు… తప్పున్నర… ఈ ప్రచారం మితిమీరితే పేద ప్రజలు తమ పిల్లల పౌష్టికాహారం పేరిట, అధిక ధరలకు హార్లిక్స్ కొనుగోలు చేసి, శాస్త్రీయంగా నిరూపితం కాని ఓ తుక్కు సరుకును పిల్లల కడుపుల్లో నింపే ప్రమాదం ఉందనేది తాజా ఆందోళన… పల్లీలు, అనగా వేరుశెనగ గింజలు ప్లస్ బెల్లంతో చేసే పల్లీచెక్కీలు తెలుసు కదా… అవి పిల్లలకు ఇస్తే హార్లిక్స్‌కన్నా చాలా రెట్లు నయం… అది ఆరోగ్యకరం… హార్లిక్స్ ప్రమాదకరం…మరి మేధావులే చెబుతున్న మాటలివి… మన తల్లిదండ్రులకు ఎక్కుతాయా ఈ మాటలు..?
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)