భార్యతో ఇలా శృంగారం చేస్తే విడాకులే


Loading...

శృంగారం ఓ మధురమైన అనుభవం.. భార్యభర్తల పరస్పర అంగీకారంతో సెక్స్‌లో పాల్గొంటే ఎటువంటి సమస్యలు రావు. కానీ ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా అది కొత్త సమస్యలకు దారితీస్తుంది. ఓ మహిళ తనకు ఎదురైన ఇలాంటి సమస్యతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన భర్త కామ వాంఛలు తీర్చుకోవడం కోసం తనను తరచూ కొట్టేవాడని, ఇష్టం వచ్చినట్లు తనపై లైంగికంగా దాడి చేసి, మృగంలా ప్రవర్తించేవాడని న్యాయస్థానం ఎదుట వాపోయింది.
Loading...

తన భర్త అకృత్యాలకు సంబంధించిన రుజువు చూపించకపోవటంతో ఆమె విజ్ఞప్తిని దిగువ న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడినట్లు రుజువు చేయలేకపోయారన్న దిగువ న్యాయస్థానం అభిప్రాయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇటువంటి చర్యలను ఇతరులెవ్వరూ చూడలేరని, వైద్యపరంగానూ అన్ని సార్లూ రుజువు చేయలేరని హైకోర్టు తేల్చి చెప్పింది. జీవిత భాగస్వామితో బలవంతపు శృంగారం, అసహజ శృంగారం విడాకులకు ప్రాతిపదికేనని పంజాబ్‌, హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)