విమానం నుంచి జారి పడ్డ మలం.. యువతి కంటికి గాయాలు


Loading...

ఇది నిజంగా విచిత్రమైన, వికారమైన, అనుకోని ఘటన. ఈ ఘటన కెనెడాలోని కెలొవానాలో చోటు చేసుకున్నది. నిజానికి ఈ ఘటన గురించి చెప్పుకోవాలన్నా కంపే. కాని.. అదే కంపు కారణంగా ఓ యువతి కన్నుకు గాయాలయ్యాయి. ముందు నీ కంపు ఆపి.. అసలు కంపులోకి వెళ్లమంటారా? సరే ముక్కు మూసుకొని చదవండి.
Loading...

సుసాన్ అల్లాన్ అనే యువతి తన కారును డ్రైవ్ చేస్తూ వెళ్తున్నది. రోడ్డు మీద రెడ్‌లైట్ పడింది. కారును ఆపింది. కారుకు సన్‌రూఫ్ ఉంది. ఇంతలో తన కారు మీద ఏదో పడిన శబ్దం వినిపించింది తనకు. వెంటనే ఆ సన్‌రూఫ్ గుండా లోపలికి ఏదో ఓ పదార్థం వచ్చి ఆమె కంటిని సూటిగా తాకింది. తన పక్కనే కూర్చున్న తన కొడుకు భుజాల మీద అది పడింది. ముందు ఏదో ద్రవం తమ మీద పడిందనుకున్నారు. కాని.. అది ద్రవంలా లేదు. అంతే కాదు అది మురుగు వాసన వచ్చింది. చాలా పెద్ద మొత్తంలో ఆ పదార్థం కారు మీద పడటంలో...
Loading...

వెంటనే కారును సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకెళ్లి క్లీన్ చేయించింది. సుసాన్, తన కొడుకు కూడా నీళ్లతో కడుక్కొని అదేంటని పరిశీలించగా అప్పుడు తెలిసింది అసలు నిజం. అది ఏదో పదార్థం కాదు.. మనిషి మలం అని అప్పుడు అర్థమయింది వాళ్లకు. అది వాళ్ల కారు మీద పడిన సమయంలోనే పైనుంచి విమానం కూడా వెళ్లడంతో విమానం నుంచి మనిషి మలం జారి పడి తమ మీద పడిందని తెలుసుకున్నది సుసాన్.

ఆరోజు వరకు బాగానే ఉంది కాని.. తెల్లారి లేచి చూసేసరికి తన కన్ను గోల్ఫ్ బాల్ అంత వాచిపోయింది. దీంతో వెంటనే డాక్టర్‌ను సంప్రదించింది. వెంటనే డాక్టర్లు తన కండ్లకు చికిత్స చేశారు. 12 రోజుల పాటు మందులు వాడాలని చెప్పారు. మొత్తానికి తను సేఫ్. కాని.. ఆ ఘటనకు తను చాలా డిస్టర్బ్ అయింది. వెంటనే సంఘటన జరిగిన సమీపంలో ఉన్న కెలొవ్నా ఎయిర్‌పోర్ట్, ట్రాన్స్‌పోర్ట్ కెనడా ఎయిర్‌పోర్టుల్లో ఆ ఘటనపై ఫిర్యాదు చేసింది. అయితే.. అటువంటి ఘటన ఏదీ తమ దృష్టికి రాలేదని దానిపై దర్యాప్తు ప్రారంభిస్తామని ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపినట్లు సుసాన్ తెలిపింది.

ఆ ప్రాంతంలో విమానం నుంచి మనిషి మలం కింద పడుతున్నట్లు చాలా మంది చాలా సార్లు ఫిర్యాదులు ఇస్తూనే ఉంటారు. నిజానికి విమానాల్లో మలాన్ని ఓ ట్యాంక్‌లో స్టోర్ చేస్తారు. విమానం ల్యాండ్ అయ్యాక ట్యాంక్‌ను ఖాళీ చేస్తారు. కాని.. అనుకోకుండా ట్యాంక్ ఎప్పుడైనా లీకయితే ట్యాంక్ నుంచి మలం వేరే సైడ్‌కు వెళ్లి గడ్డ కడుతుంది. ఎప్పుడైనా విమానం తక్కువ ఎత్తుకు దిగినప్పుడు గడ్డ కట్టిన మలం కాస్త వేడెక్కి కరిగి పోయి కింద పడిపోతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)