విశాల్‌ అద్భుత నిర్ణయం.. అభిమన్యుడు కలెక్షన్స్ లాభాలను రైతులకు పంచాలని నిర్ణయం


Loading...

తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతుల పట్ల తమిళ నటుడు విశాల్‌ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇటీవల విడుదలైన తన ‘అభిమన్యుడు’ చిత్రం సాధించిన వసూళ్లలో లాభాలను రైతులకు పంచాలని ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో టికెట్‌పై రూపాయి చొప్పున రైతులకు అందివ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తొలి వారంలోనే ఈ చిత్రం రూ.12 కోట్ల వసూళ్లను రాబట్టింది.
Loading...

తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న కథానాయకుడు విశాల్‌. ఆయన నటించిన ప్రతి చిత్రం తెలుగులోనూ విడుదలవుతుంది. పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో తాజాగా విశాల్‌ నటించిన చిత్రం ‘ఇరుంబు తిరై’. తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సైబర్‌ మోసాల నేపథ్యంలో చిత్ర కథ సాగుతుంది. కష్టపడి బ్యాంకు ఖాతాలో దాచుకున్న సొమ్మును సైబర్‌నేరగాళ్లు ఎలా దొంగిలిస్తున్నారో పూసగుచ్చినట్లు ఇందులో చూపించారు.
Loading...

బ్యాంకు ఖాతాలకు ఆధార్‌కార్డుల అనుసంధానం, ఇతర అంశాలపైనా ఇందులో సెటైర్లు పడ్డాయి. జూన్‌1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అభిమన్యుడు’ మంచి టాక్‌ను తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో విశాల్‌ టికెట్‌పై రూపాయి చొప్పున రైతులకు అందించాలని కీలక నిర్ణయం తీసుకోవడంతో సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)