వాడికి ఇద్దరు ఫ్రెండ్స్.. బావా బావా అంటూ.. ఒక ఫ్రెండ్ భార్యతో ఇంకో ఫ్రెండ్ చెల్లెలితో శృంగారం.. చివరికి


Loading...

మిత్రులే శత్రువులయ్యారు. ప్రాణ స్నేహితుడి ప్రాణం తీశారు. ఫుల్లుగా తాగించి దారుణంగా హత్య చేశారు. డెడ్‌ బాడీ దొరకకుండా మాయం చేశారు. గుత్తి కోటలో మర్డర్ కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు నిందితులను కటకటాల్లోకి నెట్టారు. అనంతపురం జిల్లా గుత్తి కోటలో గత నెల 27న సంచలనం రేపిన యువకుడి హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ప్రాణ స్నేహితులు శివ, పగలరాజులే సుమంత్ ప్రాణం తీసినట్లు పోలీసులు తేల్చారు.
Loading...

మృతుడు సుమంత్‌ది తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచేడు. పదో తరగతి వరకు చదివిన సుమంత్... ఆ తర్వాత కారు డ్రైవర్‌గా చేరాడు. సుమంత్‌కు శివ, పగలరాజు అనే ప్రాణ మిత్రులున్నారు. ఈ ముగ్గురూ కలిసిమెలిసి ఉండేవారు. ముగ్గురూ కలిసే మందుకొట్టేవారు. తాగిన మైకంలో సుమంత్ దారితప్పాడు. ఉచ్చనీచాలు మరిచిపోయాడు. స్నేహితుడు పగలరాజు భార్యపైనే కన్నేశాడు. ఆమెను బలత్కారం చేశాడు. మరో ఫ్రెండ్ శివ సోదరిని కూడా లైన్ లో పెట్టి అనుభవిస్తున్నాడు. దీంతో పద్ధతి మార్చుకోవాలంటూ శివ, పగలరాజులు... సుమంత్‌ను రెండుమూడుసార్లు హెచ్చరించారు. కానీ సుమంత్ తన స్నేహితుల హెచ్చరికలను పెడచెవిన పెట్టాడు. దీంతో శివ, పగలరాజులు కలిసి సుమంత్ మర్డర్‌కు స్కెచ్ వేశారు.
Loading...

ప్లాన్ ప్రకారం శివ, పగలరాజులు... సుమంత్‌ను మే 25న గుత్తి కోటకు తీసుకెళ్లారు. కోటలో ఉన్న రంగుల మహాల్‌ సమీపంలోని బావి పక్కనే కూర్చుని సుమంత్‌కు ఫుల్లుగా మద్యం తాగించారు. మత్తులో ఉన్న సుమంత్‌పై శివ, పగలరాజులు ఒక్కసారిగా అటాక్ చేశారు. బండరాళ్లు, మద్యం బాటిళ్లతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. కొన ఊపిరి ఉందన్న అనుమానంతో సుమంత్‌ను బావిలో పడేసి అక్కడి నుంచి జారుకున్నారు. రెండు రోజుల తర్వాత డెడ్‌బాడీ దొరకడంతో పోలీసులు అతడి వివరాల కోసం ఐదురోజులుగా ప్రయత్నించారు. చివరికి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో సుమంత్‌గా గుర్తించారు. శివ, పగలరాజులే హత్యచేసినట్లు సుమంత్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య చేసిన విషయాన్ని వాళ్లతో కక్కించారు. అక్రమ సంబంధం, అసభ్య ప్రవర్తనలే సుమంత్ హత్యకు కారణాలయ్యాయి. ఫ్రెండ్స్ హెచ్చరించినప్పుడు తన ప్రవర్తన మార్చుకునివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. తమవాళ్ల జోలికొస్తే స్నేహితులైనా శత్రువులుగా మారుతారనడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)